ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Zee-Sony Merger: జీతో ఒప్పందం రద్దు చేసుకునే యోచనలో సోనీ

ABN, Publish Date - Jan 08 , 2024 | 07:47 PM

Zee-Sony Merger: ప్రముఖ మీడియా దిగ్గజం సోనీ గ్రూప్‌ సంచలన నిర్ణయం తీసుకోనుంది. భారత్‌కు చెందిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జీల్‌)తో కుదుర్చుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ మీడియా దిగ్గజం సోనీ గ్రూప్‌ సంచలన నిర్ణయం తీసుకోనుంది. భారత్‌కు చెందిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జీల్‌)తో కుదుర్చుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 2021లో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం విలీనం తర్వాత ఏర్పడే కంపెనీకి సీఈవో, ఎండీగా జీ ఫౌండర్ పునీత్ గోయెంకా బాధ్యతలు చేపట్టాలి. కానీ నిధులు మళ్లించారంటూ జీ యాజమాన్యంపై సెబీ చర్యలకు ఉపక్రమించడంతో ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో సోనీ యాజమాన్యం ఉందని సమాచారం అందుతోంది.

అసలు ఏం జరిగింది?

నిధులు మళ్లించారంటూ ఆరోపణలు రావడంతో సెబీ జీ సంస్థ యాజమాన్యంపై కీలక చర్యలు తీసుకుంది. జీ సంస్థ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర, ఆయన తనయుడు పునీత్‌ గోయెంకా ఏ నమోదిత సంస్థలోనూ డైరెక్టర్‌ లేదా ఇతర ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. దీంతో సుభాష్‌, గోయెంకా సెబీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎస్‌ఏటీ)ని ఆశ్రయించారు. అక్కడ వారికి చుక్కెదురైంది. దీంతో జీ, సోనీ విలీనం అంశంపై సందిగ్ధం నెలకొంది. సెబీ ఉత్వర్వులతో జీ-సోనీ కంపెనీ సీఈవోగా గోయెంకా ఉండేందుకు సోనీ అంగీకరించడం లేదని తెలుస్తోంది. విలీనానికి అవసరమైన కొన్ని షరతులు నెరవేరలేదని పేర్కొంటూ, ఒప్పందాన్ని ముగించడానికి జనవరి 20 పొడిగించిన గడువులోపు రద్దు నోటీసును దాఖలు చేయాలని సోనీ యోచిస్తోంది. ఇరుపక్షాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. గడువులోగా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 07:47 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising