ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tata Punch EV: మార్కెట్లోకి టాటా పంచ్ ఈవీ..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్ల రేంజ్

ABN, Publish Date - Jan 17 , 2024 | 07:58 PM

టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు Tata Punch.ev దేశీయ మార్కెట్లోకి విడుదలైంది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పంచ్ EV బుకింగ్‌ను జనవరి 5న ప్రారంభించింది. ఈరోజు జనవరి 17, 2024న దాని ధరను ప్రకటించారు.

టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు Tata Punch.ev దేశీయ మార్కెట్లోకి విడుదలైంది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పంచ్ EV బుకింగ్‌ను జనవరి 5న ప్రారంభించింది. ఈరోజు జనవరి 17, 2024న దీని ధరను ప్రకటించారు. టాటా మోటార్స్ Tiago EV, Tigor EV, Nexon EVల తర్వాత నాల్గో తరం ఎలక్ట్రిక్ కారు అయిన పంచ్ EV ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.10.99 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.49 లక్షలుగా పేర్కొన్నారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Stock Market: సెన్సెక్స్ ఢమాల్..రూ.4.33 లక్షల కోట్లు కోల్పోయిన మదుపర్లు

ఇక టాటా పంచ్ EV (Tata Punch.ev) మొత్తం 8 వేరియంట్‌లలో వచ్చింది. ఇందులో పంచ్ EV స్టాండర్డ్ ఆప్షన్‌లో (5 kWh బ్యాటరీ, 315 కిలోమీటర్ల పరిధి) స్మార్ట్ (బేస్ మోడల్) వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.10.99 లక్షలు, స్మార్ట్ ప్లస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షలు, అడ్వెంచర్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.99 లక్షలు, ఎంపావర్డ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 12.70 లక్షలు, ఎక్స్ షోరూమ్ ధర ఎంపావర్డ్ ప్లస్ వేరియంట్ ధర రూ.13.29 లక్షలుగా ఉంది.

25kWh బ్యాటరీ ప్యాక్‌తో ప్రామాణిక మోడల్ 315km (MIDC) రేంజ్ కల్గి ఉంది. లాంగ్ రేంజ్ మోడల్ 35kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుండగా ఇది 421km (MIDC) రేంజ్ ఇంస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. మోటారు, బ్యాటరీ ప్యాక్ IP67 రేటెడ్, ఎనిమిదేళ్లు లేదా 1,60,000కిమీల వారంటీని కలిగి ఉంటాయి.

ఇది యాక్టివ్ ఆర్కిటెక్చర్ ఆప్టిమైజ్ టెక్నాలజీతో చేయబడిన బ్యాటరీ ప్యాక్ డిజైన్‌ను కలిగి ఉంది. దీని ఆధారంగా వాహనాల సింగిల్ చార్జ్ బ్యాటరీ పరిధి 300 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. Acti.ev ఆర్కిటెక్చర్ ఆధారంగా వీల్ డ్రైవింగ్, వెనుక చక్రాలు, ఫార్వర్డ్ వీల్ డ్రైవ్‌ట్రెయిన్ అందుబాటులో ఉంది. యాక్టివ్ ఆర్కిటెక్చర్ AC ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 7.2kW నుంచి 11kW ఆన్ బోర్డ్ ఛార్జర్‌ తోపాటు DC ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 150kW వరకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు కేవలం 10 నిమిషాలు ఈ వాహనం ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 07:58 PM

Advertising
Advertising