Bharat Chawal: గుడ్ న్యూస్.. రూ.25కే కిలో బియ్యం.. ఎప్పుడు ఎలా అంటే..
ABN, Publish Date - Jan 27 , 2024 | 12:49 PM
ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు.. అని ఆనాడు వచ్చిన ఓ సినిమా పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు.. అని ఆనాడు వచ్చిన ఓ సినిమా పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే ప్రస్తుతం కూడా అవే పరిస్థితులు ఉండటం, ఎలాంటి మార్పులు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. దేశంలో ఎక్కువ శాతం మంది ఆహారంగా తీసుకునే బియ్యం ధరలు అమాంతం ఆకాశానికంటేశాయి. బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, వంట నూనె, నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చేశాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంచంలో పిడికెడు బువ్వ కోసం ఖాళీ కడుపుతో పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
భారత్ చావల్ పేరుతో తక్కువ ధరకే బియ్యం అందించాలని నాఫెడ్ వెల్లడించింది. పేద ప్రజల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కిలో బియ్యం రూ.25 కు విక్రయించనున్నారు. పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం భారత్ గోధుమపిండి రూ.27.50, శనగపప్పు కిలో రూ.60 కు విక్రయిస్తున్నారు. నవంబర్‌లో 8.7 శాతంగా ఉన్న రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 9.53 శాతానికి పెరిగింది.
అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అధిక మొత్తంలో సరకును నిల్వ ఉంచుకోకూడదని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేసింది.
Updated Date - Jan 27 , 2024 | 12:49 PM