Gold Rates Today: శ్రావణమాసం వచ్చేసింది.. ఇక బంగారానికి ఫుల్ డిమాండ్
ABN, Publish Date - Aug 05 , 2024 | 07:41 AM
ఏడాదిలో అత్యంత శుభ్రప్రదమైన మాసాల్లో శావ్రణ మాసం ఒకటి. శుభకార్యాలకు నెలవైన ఆ మాసం నేటి నుంచి ప్రారంభమైంది. దీంతో పూజలు, వ్రతాలతో ప్రతి ఇల్లు కళకళలాడతాయి. దాంతో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడనుంది. అదీకాక ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకం తగ్గించింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గాయి. దీంతో నాటి నుంచి వీటి కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
హైదరాబాద్, ఆగస్ట్ 05: ఏడాదిలో అత్యంత శుభ్రప్రదమైన మాసాల్లో శావ్రణ మాసం ఒకటి. శుభకార్యాలకు నెలవైన ఆ మాసం నేటి నుంచి ప్రారంభమైంది. దీంతో పూజలు, వ్రతాలతో ప్రతి ఇల్లు కళకళలాడతాయి. దాంతో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడనుంది. అదీకాక ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకం తగ్గించింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గాయి. దీంతో నాటి నుంచి వీటి కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
అయితే ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు భారీగా పెరిగితే.. మరో రోజు స్వల్పంగా తగ్గుతుంది. ఒక రోజు స్వల్పంగా తగ్గితే.. మరో రోజు స్వల్పంగా పెరుగుతుంది. తాజాగా ఆగస్ట్ 5వ తేదీ అంటే... నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,690కి తగ్గింది. మేలిమి బంగారం.. అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70 వేల మార్కును దాటింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈ రోజు రూ. 70,057గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగారాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,690 ఉంది. ఇక మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.70,570 వద్ద ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,570గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో ఇలా..
దేశ రాజధాని న్యూఢిల్లీ మహానగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,840గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.70,720గా ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,570 ఉంది. అలాగే చెన్నై మహానగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,490 ఉండగా, మెలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.70,350గా వద్ద ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,570 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,690 ఉండగా, మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.70,570 వద్ద ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,570 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.85,400 ఉంది.
Read More Business News and Latest Telugu News
Updated Date - Aug 05 , 2024 | 07:44 AM