Best 125cc Bikes: 2024లో టాప్ 5 125సీసీ బైక్స్ చుశారా?
ABN, Publish Date - Jan 29 , 2024 | 08:41 PM
దేశంలో దిగువ మధ్యతరగతి ప్రజలు కార్లకు బదులు ద్విచక్రవాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం అందుబాటు ధరలతోపాటు మంచి మైలేజ్ ఇస్తున్న టాప్ 5 125 సీసీ బైక్స్ వివరాలను ఇప్పుడు చుద్దాం.
దేశంలో దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కార్లకు బదులు ద్విచక్రవాహనాలను కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం అందుబాటు ధరలతోపాటు మంచి మైలేజ్ ఇస్తున్న టాప్ 5 125 సీసీ బైక్స్ వివరాలను ఇప్పుడు చుద్దాం. ఎందుకంటే ప్రస్తుతం 125సీసీ బైక్ సెగ్మెంట్ ట్రెండ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇవి పవర్‌తో పాటు మంచి లుక్స్, ఫీచర్లను కలిగి ఉన్నాయి. వాటిలో Hero MotoCorp, Honda, TVS, Bajaj, TVS వంటి కంపెనీలు ఈ విభాగంలో మంచి బైక్‌లను తీసుకువచ్చాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Budget 2024: ఉద్యోగుల అంచనాలను నెరవేరుస్తుందా..ఈ డిమాండ్స్ చుశారా?
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్
Hero MotoCorp 125సీసీ సెగ్మెంట్‌లో ఎక్స్‌ట్రీమ్ 125R అత్యంత స్టైలిష్ బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.95,000 నుంచి మొదలై రూ. 99,500 వరకు ఉంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. త్రి కలర్ ఆప్షన్స్ కలిగిన ఈ బైక్ బరువు 136 కిలోలు. స్పోర్టీ లుక్, సరికొత్త ఫీచర్లతో వస్తున్న ఈ బైక్ మైలేజ్ లీటరుకు 66 కిలోమీటర్లు ఇస్తుందని ప్రకటించారు. ఇందులో 10 లీటర్ల ఇంధన ట్యాంక్ సౌకర్యం కలదు.
TVS రైడర్
ఇక TVS మోటార్ కంపెనీ నుంచి వచ్చిన అద్భుతమైన బైక్ రైడర్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.95,219 నుంచి రూ.1.03 లక్షల వరకు ఉంది. 123 కిలోల బరువున్న ఈ మోటార్‌సైకిల్‌లో 124.8 cc ఇంజన్‌ను కల్గి ఉంది. ఇది గరిష్టంగా 11.38 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. క్రేజీ లుక్, ఫీచర్‌లతో కూడిన ఈ ద్విచక్రవాహనం మైలేజ్ 67 kmpl వరకు ఇస్తుందని పేర్కొన్నారు.
బజాజ్ పల్సర్ NS 125
బజాజ్ ఆటోలో ప్రముఖ పల్సర్ సిరీస్‌లో అత్యంత చౌకైన మోటార్‌సైకిల్ పల్సర్ NS125. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.99,571. ఇది నాలుగు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది. ఈ బైక్ శక్తివంతమైన 124.45 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 11.99 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 144 కిలోల బరువున్న ఈ మోటార్‌సైకిల్ మైలేజ్ 64.75 కి.మీ. ఇవ్వనుంది.
హోండా SP 125
125 cc విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిళ్లలో ఒకటి హోండా SP125. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.86,017 నుంచి రూ.90,567 వరకు ఉంది. ఏడు రంగుల ఎంపికలతో మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ మోటార్‌సైకిల్ 123.94 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 10.87 PS వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 116 కిలోల బరువున్న ఈ మోటార్‌సైకిల్‌లో 11.2 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కల్గి ఉంది. దీని మైలేజ్ కూడా చాలా బాగుంది.
KTM 125 డ్యూక్
KTM డ్యూక్ 125 ఈ విభాగంలో అత్యంత స్టైలిష్, శక్తివంతమైన ద్విచక్రవాహనం. కాకుంటే ఇది అధిక ధరను కలిగి ఉంది. అంటే దీని ధర రూ. 1.79 లక్షలు. ఇందులో 124.7 cc ఇంజన్ ఉంది. ఇది 14.5 PS వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 159 కిలోల బరువు, 13.4 లీటర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో లభిస్తుంది. ఈ బైక్ లీటరుకు 46.92 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది.
గమనిక: ఈ వార్త ప్రత్యేకంగా కంపెనీలను ప్రమోట్ చేసేందుకు రాసినది కాదు. మాకు లభించిన సమాచారం ఆధారంగా రాయడం జరిగింది.
Updated Date - Jan 29 , 2024 | 08:41 PM