ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: మద్యం మత్తులో డ్రైవింగ్‌.. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి మృతి

ABN, Publish Date - Jan 02 , 2024 | 11:21 AM

బాలానగర్‌ సాయీనగర్‌లో నివాసముండే కందుకూరి దుర్గయ్య (58) అమీర్‌పేటలోని ఓ షాపింగ్‌మాల్‌లో హౌస్‌ కీపింగ్‌ పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకున్న దుర్గయ్య ఆటోలో బాలానగర్‌(Balanagar)కు వచ్చి మేజేస్టిక్‌ గార్డెన్‌ నుంచి ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. బాలానగర్‌లో మద్యం మత్తులో బైక్‌ నడిపిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టాడు. హైదర్‌నగర్‌లో మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహన్నాన్ని ఢీకొట్టాడు. దీంతో వృద్ధుడు, ద్విచక్రవాహనదారుడు మృతి చెందారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో కేసులు దర్యాప్తులో ఉన్నాయి.

బాలానగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): బాలానగర్‌ సాయీనగర్‌లో నివాసముండే కందుకూరి దుర్గయ్య (58) అమీర్‌పేటలోని ఓ షాపింగ్‌మాల్‌లో హౌస్‌ కీపింగ్‌ పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకున్న దుర్గయ్య ఆటోలో బాలానగర్‌(Balanagar)కు వచ్చి మేజేస్టిక్‌ గార్డెన్‌ నుంచి ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఓ పల్సర్‌ బైకు(నెంబర్‌ ఏపీ29ఏఆర్‌9188) వెనక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో కిందపడి తీవ్రగాయాలైన దుర్గయ్యను స్థానికులు గుర్తుపట్టి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుమారుడు కందుకూరి ప్రవీణ్‌ తండ్రిని 108లో సనత్‌నగర్‌ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. బాలానగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‏స్టేషన్‌కు తరలించి బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష నిర్వహించారు. మద్యం మత్తులోనే యాక్సిడెంట్‌ చేసినట్లు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎస్సార్‌నగర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మల్లికార్జున్‌పై మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని బాలానగర్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 02 , 2024 | 11:21 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising