Viral News: అమ్మ రూ.20 వేలు ఇవ్వలేదని ఊహించని దారుణానికి పాల్పడ్డ కొడుకు
ABN, Publish Date - Oct 24 , 2024 | 06:08 PM
అడిగితే రూ.20 వేలు ఇవ్వనన్నందుకు ఓ యువకుడు తన కన్నతల్లినే కడతేర్చాడు. తన ఇద్దరు స్నేహితుల సాయంతో ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఘజియాబాద్‌లోనూ ఈ దారుణలో ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
న్యూఢిల్లీ: క్షణికావేశంలో కొందరు కన్నబంధాలను కూడా కడతేర్చుకుంటున్నారు. ఇదే తరహాలో మరో ఘటన వెలుగుచూసింది. అడిగితే రూ.20 వేలు ఇవ్వనన్నందుకు ఓ యువకుడు తన కన్నతల్లినే కడతేర్చాడు. తన ఇద్దరు స్నేహితుల సాయంతో ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఘజియాబాద్‌లో ఈ దారుణలో ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీ ప్రాంతంలో అక్టోబర్ 4న ఉదయం ఓ 47 ఏళ్ల సంగీత అనే మహిళ మృతదేహానికి సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దర్యాప్తు మొదలు పెట్టడంతో అసలు విషయం వెలుగుచూసింది. సంగీత కొడుకు సుధీర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేల్చారు. ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను హత్య చేసినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు.
డీజే మిక్సర్‌ను రిపేర్ చేయడానికి రూ.20 వేలు ఇవ్వాలని తల్లిని కోరాడని, అయితే ఆమె డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ హత్యకు పాల్పడ్డట్టు చెప్పారు. సుధీర్‌తో పాటు అతడికి సహకరించిన ఇద్దరు స్నేహితులను అరెస్టు చేసి జైలుకు పంపించినట్టు వెల్లడించారు.
కాగా నిందితుడు సుధీర్ పలు దోపిడీలు, నేరాల్లో నిందితుడిగా ఉన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడని చెప్పారు. ఫంక్షన్లలో డీజేగా పనిచేస్తుంటాడని వివరించారు. ఇక మృతురాలు సంగీత చిన్న బట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తుండేదని తెలిపారు. డీజే రిపేర్‌కు కాకుండా తన వ్యసనాలకు ఉపయోగిస్తాడమేమోనన్న అనుమానంతో ఆమె డబ్బు ఇవ్వకుండా నిరాకరించింది. దీంతో సుధీర్‌కు ఆవేశానికి లోనయ్యాడు. అక్టోబరు 3న రాత్రి సమయంలో సంగీతను బైక్‌పై ఎక్కించుకుని స్నేహితులు అంకిత్, సచిన్‌లు ఎదురుచూస్తున్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె తలపై ఇటుకతో కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని ట్రోనికా సిటీ ప్రాంతంలో పడేసి అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు చెప్పారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించామని పోలీసులు తెలిపారు. ఆమె కొడుకే నేరస్థుడని వివరించారు. తన స్నేహితులు ఇద్దరితో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడని గుర్తించినట్టు చెప్పారు. నిందితుడు సుధీర్ ఫంక్షన్లలో డీజేగా పనిచేయడం తప్ప ఇతర పనులేమీ చేయడని గుర్తించినట్టు వివరించారు. డీజేగా కూడా అప్పుడప్పుడే చేస్తాడని వివరించారు. కాగా సుధీర్ స్నేహితులు అంకిత్, సచిన్‌లకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని వెల్లడించారు.
Updated Date - Oct 24 , 2024 | 06:14 PM