Amaravathi : అమరావతిలో పర్యటించిన అయోధ్య రామాలయ ట్రస్టీ..!!
ABN, Publish Date - Mar 29 , 2024 | 12:04 PM
వాసుదేవనంద సరస్వతీ స్వామి అయోధ్య రామాలయ ట్రస్టీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు., ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, దక్షిణాదిలో అన్ని రామాలయాలతో పాటు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నాం అన్నారు.
విజయవాడ: ఏపిలో పర్యటిస్తున్న అయోధ్య రామాలయ ట్రస్టీ, శ్రీమాన్ జ్యోతిష్ పీఠాధిపతి స్వామీ వాసుదేవనంద సరస్వతీ విజయవాడ కనకదుర్గమ్మను దర్శనం చేసుకుని, పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో దేవస్థానం ఇఒ రామారావు స్వానిజీకి సాదర స్వగతం పలికారు. ఆలయ దర్శనంలో భాగంగా పెద వడ్లపూడిలో గోశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాసుదేవానంద స్వామీజీ, గోపూజను నిర్వహించారు.
వాసుదేవనంద సరస్వతీ స్వామి అయోధ్య రామాలయ ట్రస్టీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు., ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, దక్షిణాదిలో అన్ని రామాలయాలతో పాటు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నాం అన్నారు. హైదరాబాదు లో ప్రారంభమైన మా యాత్ర రామేశ్వరం వరకు సాగుతుందన్నారు. ఇదే విషయంగా మాట్లాడుతూ ఆయన రామ తత్వం దేశ ప్రజల ఆస్తి, అయోధ్య రాముడు ఉత్తరాదికే పరిమితం కాదు, ప్రతి హిందువు తప్పకుండా దర్శించాల్సిన ఆలయాలలో బాల రామాలయం కూడా ఒకటి. మన సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైనా ఉంది. గోవుల సంరక్షణను కూడా అందరూ ముఖ్యమైన బాధ్యతగా తీసుకోవాలి అన్నారు.
స్వామీజీ వద్ద బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, గోశాల నిర్వాహకులు పాతూరి నాగభూషణం, ధర్మ ప్రచారక్, కేసి రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
అనంతరం స్వామీజీ భక్తులకు ప్రసాద వితరణ చేసారు.
Updated Date - Mar 29 , 2024 | 12:13 PM