Horoscope Today: ఈ రాశుల వారికి అన్నీ శుభాలే.. చెక్ చేసుకోండి!
ABN, Publish Date - Mar 21 , 2024 | 07:00 AM
నేడు (21-3-2024 - గురువారం) పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. సంతాన విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది..
Horoscope Today: నేడు (21-3-2024 - గురువారం) పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. సంతాన విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది....
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. సంతాన విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వినూత్నంగా ఆలోచించి సత్ఫలితాలు సాధిస్తారు. ప్రియతమలు వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సాయినాథుని ఆరాధన శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తారు. దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. ఫర్నీచర్, హార్డ్‌వేర్, నిత్యావసరాల రంగాల వారికి అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల సహకారం లభిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
పెద్దల సహకారంతో ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత పదవులు అందుకునేందుకు ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. శ్రీసాయిబాబా ఆరాధన శుభప్రదం.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
కళలు, న్యాయ, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వ్యూహాలను విజయవంతంగా అెులు చేస్తారు. వీ సా, పాస్‌పోర్ట్ కోసం చేసే ప్రయత్నాలకు అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దత్తకవచ పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పన్నులు, బీమా, పెన్షన్, గ్రాట్యుటీ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. గత స్మృతులు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనసుకు ఊటనిస్తాయి. పెద్దల ఆరోగ్యం కలవరం కలిగిస్తుంది. సాయినాదుని ఆరాధించండి
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. శుభకార్యాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. దత్తకవచ పారాయణ శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
పెద్దల సహకారంతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాదిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైన సమావేశాలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వైద్య, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. షిర్డిసాయిబాబా ఆరాధన శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
పైచదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. కన్సల్టెన్సీలు, క్రీడలు, చిట్‌ఫండ్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టులను అమలు చేయడంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దత్తకవచ పారాయణ శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
గృహరుణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గత స్మృతులు గుర్తుకు వస్తాయి. మరమ్మతులకు వెచ్చిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. గాయత్రీమాత ఆరాధన శుభప్రదం.
కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
చర్చలు, ప్రయాణాలు ఉ ల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రుల నుంచి సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. సాయిబాబా ఆరాధన శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి ఆర్థింకంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల కోసం ఖర్చు చేస్తారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది. దక్షిణామూర్తిని ఆరాధించండి.
- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి
Updated Date - Mar 21 , 2024 | 07:28 AM