Kartika Masam 2024: ఎంత ప్రయత్నించినా వివాహం కుదరట్లేదా.. కార్తీక మాసంలో ఇలా చేయండి
ABN, Publish Date - Nov 09 , 2024 | 04:24 PM
వివాహంలో అడ్డంకులు, నచ్చిన జీవిత భాగస్వామిని పొందలేకపోవడం వంటి సమస్యలన్నింటికీ కార్తీక మాస పరిహారాలు ఎంతో కీలకం.
కార్తీక మాసం పూజలు, ఉపవాసాలకే కాదు.. ధర్మబద్ధమైన ఎటువంటి కోరికనైనా నెరవేర్చుకునేందుకు అనువైన మాసం ఇది. ఈశ్వరుడిని భక్తితో పూజిస్తే అంతులేని తెలివితేటలు, మానసిక ప్రశాంతత, సంఘంలో గౌరవం, జీవితంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయని హిందూ ధర్మం చెప్తోంది. అంతేకాదు పెళ్లి కాని వారు భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే విఘ్నాలన్నీ తొలగించి మనసుకు నచ్చిన జీవిత భాగస్వామిని ప్రసాదిస్తాడని ప్రతీతి.
గ్రహ దోషాలు బాధిస్తుంటే..
జాతకంలో ఎటువంటి దోషాలున్నా సరే.. శివానుగ్రహం ఉంటే చాలంటారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో దేవత ఉంటుంది. అయితే, వాటన్నింటికీ అది దేవుడు మాత్రం శివుడే. గ్రహాలన్ని శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ ఉంటాయంటారు. అందుకే చాలా మంది భక్తులు నవగ్రహ దోష పరిహారాలు చేయలేకపోతే శివుడికి అర్చన, అభిషేకాలు చేస్తుంటారు. వివాహానికి ఎంతో కీలకమైన గురుబలం రావాలన్నా.. కుజ, శుక్ర దోషాలు తొలగాలన్నా అన్నింటికీ ఈ ఒక్క పరిహారం చేస్తే సరిపోతుంది.
పౌర్ణమి ప్రత్యేకం..
కార్తీకమాసంలో శుక్లపక్ష పున్నమి తిథిలో 15వ రోజు వచ్చే కార్తీక పౌర్ణమి మరింత ప్రత్యేకమైంది. దీన్నే కౌశిక లేదా వైకుంఠ పౌర్ణమి జీడికంటి పున్నమని పిలుస్తుంటారు. ఈ రోజున తెల్లవారకముందే స్నానం చేస్తారు. శివుడి గుడికి వెళ్లి గుమ్మడ ఆకు, వక్క, పండ్లని బ్రాహ్మణులకు దానమిస్తుంటారు. ముత్తైదువులకు వాయినాలు కూడా ఇస్తారు. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అరటిదొన్నెలో దీపాలను వెలగించి పసుపు, కుంకుమ చల్లి నదులు, కాలువల్లోకి వదులుతారు. ఇలా చేయడం వల్ల అష్టశ్వర్యాలతో పాటు కుటుంబ సౌఖ్యం కలుగుతుందని నమ్ముతారు.
శీఘ్ర వివాహ ప్రాప్తి..
ఒక్క కార్తీక మాసంలోనే కాదు ప్రతి మాసంలోనూ పౌర్ణమి రాత్రి శివుడికి ఎంతో ప్రీతికరమైంది. ఆ రోజున సంధ్యా సమయంలో ముక్కోటి దేవతలు శివుడిని అర్చించేందుకు వస్తారని పండితులు చెప్తుంటారు. ఆ సమయంలో పెళ్లి కాని యువతీ యువకులు ఈశ్వరుడిని పాలతో అభిషేకిస్తే శీఘ్రంగా వివాహ ప్రాప్తి పొందుతారని జ్యోతిష్యశాస్త్రం చెప్తోంది. పౌర్ణమి నాడు కాకపోయినా క్రమం తప్పకుండా 41 రోజులు నీటితో లింగాన్ని అభిషేకించినా ఎన్నో రెట్ల ఫలితం కలుగుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN బాధ్యత వహించదు.)
Koti Somavaram 2024: కార్తీక శనివారం రోజు కోటి సోమవారం ఎలా అయ్యింది.. ఈ రోజు దీపం వెలిగించారా
Updated Date - Nov 09 , 2024 | 05:02 PM