The Horoscope : ఈ రాశి విద్యార్థులకు శుభప్రదం కలదు !
ABN, Publish Date - Jun 20 , 2024 | 02:48 AM
నేడు (20-06-2024-గురువారం) అన్నదమ్ముల విషయాల్లో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి.
నేడు (20-06-2024-గురువారం) అన్నదమ్ముల విషయాల్లో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
అన్నదమ్ముల విషయాల్లో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. ప్రయాణాలు, చర్చల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు లక్ష్య సాధన కు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
పన్నులు, రుణాలపై దృష్టి సారిస్తారు. పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. వైద్య సేవల కోసం ఖర్చులు అంచనాలు మించిపోతాయి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
భాగస్వామికి సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తారు. సమావేశాలు ఫలిస్తాయి. పందాలు, పోటీలు, షేర్‌మార్కెట్ లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. సాయిబాబాను ఆరాధించండి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
వైద్య, ఫార్మా, హోటల్, సేవా రంగాల వారికి అనుకూల సమయం. సహోద్యోగుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. క్రీడలు, బ్యాంకులు, పాఠశాల రంగాల వారికి ఖర్చులు అధికం. ఆర్థిక విషయాల్లో ప్రియతముల వైఖరి ఆ వేదన కలిగిస్తుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పెద్దలు, పైఅధికారుల వైఖరిలో మార్పు గమనిస్తారు. ఇల్లు, స్థలసేకరణ విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కుటుంబ విషయాలు ఆవేదనకు గురిచేస్తాయి. సాయిబాబాను ఆరాధించండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
విద్యా సంస్థల్లో ప్రవేశానికి చే సే ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్నారులు, ప్రియతములతో ఆనందంగా గడుపుతారు. క్రీడలు, కన్సల్టెన్సీ, అడ్వర్టయిజ్‌మెంట్, ప్రచురణ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఇల్లు, స్థల సేకరణకు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తారు. పన్నులు, ఇన్సూరెన్స్, గృహరుణాల వ్యవహారాలకు అనుకూల సమయం. పెన్షన్ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల ఆ రోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. విద్యా సంస్థల్లో ప్రవేశం లహాస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. సాయిబాబాను ఆరాధించండి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఇంటర్వూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం లభిస్తుంది. వైద్య సేవలకు ఖర్చులు అధికం. పరిశ్రమలు, వ్యవసాయం, హోటల్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. గాయత్రీ మాతను ఆరాధించండి.
కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులకు శుభప్రదం. టెలివిజన్, కళలు, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఆడ్వర్టయిజ్‌మెంట్స్, కన్సల్టెన్సీ, చిట్‌ఫండ్ రంగాల వారు నిదానం పాటించాలి.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఇల్లు, స్థలసేకర ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.
- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి
Updated Date - Jun 20 , 2024 | 02:48 AM