ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope : ఈ రాశి వారు ప్రయాణాలు, చర్చల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

ABN, Publish Date - Nov 01 , 2024 | 05:34 AM

నేడు (01-10-2024-శుక్రవారం) షేర్‌మార్కెట్‌ లావాదేవీల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

నేడు (01-10-2024-శుక్రవారం) షేర్‌మార్కెట్‌ లావాదేవీల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

షేర్‌మార్కెట్‌ లావాదేవీల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదుర్కొంటారు. న్యాయ వివాదాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పందాలు పోటీలకు దూరంగా ఉండాలి. గోమాత ఆరాధన శుభప్రదం.


వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి చిక్కులు ఎదురవుతాయి. ఫార్మా, హాస్టళ్లు, ఆహార రంగ వ్యాపారులకు కొంత నిరాశ ఎదరయ్యే అవకాశం ఉంది. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. దుర్గామాతను ఆరాధించండి.


మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ కోసం ఖర్చులు అధికం. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాలి. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడుల్లో నిదానం అ వసరం. శ్రీ కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. భూములు, ఇళ్ల క్రయవిక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అ వకాశం ఉంది. హార్డ్‌వేర్‌, నిర్మాణ సామగ్రి, ఫర్నీచర్‌ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. అద్దె వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. అన్నదానం శుభప్రదం.


సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

డ్రైవింగ్‌లో నిదానం పాటించండి. రాతకోతల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. చెక్కులు, పత్రాలు సకాలంలో అందకపోవడంతో ఇబ్బంది పడతారు. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. లలితాదేవిని ఆరాధించండి.


కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. డబ్బు విషయంలో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. విలాలసాకు ఖర్చు చేస్తారు. దుర్గా అష్టోత్తరనామ పారాయణ శుభప్రదం.


తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

వ్యక్తిగత సౌకర్యాలను పెంపొందించుకుంటారు. మీ ప్రయత్నాలకు కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సన్నిహితులు మీ ఆలోచనలకు బిన్నంగా వ్యవహరించడతో మనోవేదనకు గురవుతారు. మహాలక్ష్మీదేవి ఆరాధన శుభ ప్రదం.


వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

దూరప్రయాణాలు, విదేశీ వ్యవహరాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సినీ, రాజకీయ రంగాల వారు కొంత నిదానం పాటించాలి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా పూర్తవుతాయి. యోగధ్యానాలు సత్ఫలితాలనిస్తాయి.


ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. విలువైన వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యతను గమనించాలి. ఫైనాన్స్‌, చిట్‌ఫండ్‌లు, వడ్డీ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రీ కనకధారా స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.


మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. ప్రభుత్వ సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గౌరవమర్యాదలకు భంగం కలగవచ్చు. శ్రీ రామ దుర్గాష్టక పారాయణ శుభప్రదం.


కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కన్సల్టెన్సీలు, విద్యాసంస్థలు, ఈ వెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. సమావేశాల్లో నిదానం అవసరం. మహాలక్ష్మీ ఆరాధన శుభప్రదం.


మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సకాలంలో డబ్బు చేతికి అందక కొంత ఇబ్బంది పడతారు. పన్నులు, బ్యాంక్‌లోన్‌ల వల్ల సమస్యలు ఎదురవుతాయి. పెన్షన్‌, మెడికల్‌ క్లెయిములు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Nov 01 , 2024 | 05:39 AM