ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థిక విషయాలకు సంబంధించి ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది.

ABN, Publish Date - Aug 23 , 2024 | 05:58 AM

నేడు (23-08-2024- శుక్రవారం ) వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, వైద్య రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు.

నేడు (23-08-2024- శుక్రవారం ) వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, వైద్య రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, వైద్య రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.


వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, సినీ రంగాల వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విదేశీ చదువులు, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కళలు, రచనలు, ముద్రణ రంగాల వారికి ప్రోత్సాహకరమైన రోజు. సంకల్పం నెరవేరుతుంది.


మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇల్లు, స్థలసేకరణకు కావలసిన నిధుల సేకరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలంగా రాని బకాయిలు వసూలవుతాయి. ఇంటికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. పెద్దలతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. పదిమందిలో గౌరవ మన్ననలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన కీలక పత్రాలు సేకరిస్తారు.


సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

సంకల్పం నెరవేరుతుంది. ప్రయాణాలు, ఉన్నత విద్యకు కావలసిన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలు, ప్రదర్శనల్లో సత్ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో ఆర్థిక వ్యవహారాలు చర్చకు వస్తాయి.


కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మ్యూచ్యువల్‌ ఫండ్స్‌, షేర్‌మార్కెట్‌ లావాదేవీలపై దృష్టి సారిస్తారు. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. పన్నులు, బీమా, పెన్షన్‌, రుణ సేకరణ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.


తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. రాజకీయ, సినీ రంగాల వారు కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం. గౌరవ పదవులు అందుకుంటారు. పదిమందిని కలుపుకుని మంచి పనులు చేపడతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.


వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.


ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ లోని సృజన్మాత్మక ప్రతిభకు గుర్తింపు లభి స్తుంది. టెలివిజన్‌, కన్సల్టెన్సీ, విద్యా రంగాల వారికి అనుకూలమైన రోజు. బృందకార్యక్రమాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు.


మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

దూరంలో ఉన్న బంధుమిత్రు కలయిక ఆనందం కలిగిస్తుంది. ఇల్లు, స్థల సేకరణకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాసంస్థల్లో ప్రవేశానికి మార్గ సుగమం అవుతుంది. వ్యూహాత్మకంగా వ్యవహరించి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.


కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాలకు సంబంధించి ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెక్కులు అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.


మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

స్టాక్‌మార్కెట్‌ లావాదేవీల్లో లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహకారం ల భిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ప్రియతమలు కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Aug 23 , 2024 | 06:05 AM

Advertising
Advertising
<