Today Horoscope : ఈ రాశి వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది.
ABN, Publish Date - Oct 28 , 2024 | 06:06 AM
నేడు (28-10-2024-సోమవారం) ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది.
నేడు (28-10-2024-సోమవారం) ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పరిశ్రమలు, వ్యవసాయం రంగాల వారికి అవసరానికి నిధులు సర్దుబాటు అవుతాయి. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. సినిమాలు, టెలివిజన్, క్రీడలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. రవాణా, మార్కెటింగ్, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. శివాలయ సందర్శన శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. గృహనిర్మాణం, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం ఖ ర్చులు అధికం. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
విద్యా విషయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. రవాణా, బోధన, కమ్యూనికేషన్లు, స్టేషనరీ రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. తోబుట్టువులు, సన్నిహితుల వ్యవహారశైలి ఆవేదన కలిగిస్తుంది. శివ పంచాక్షరీ పారాయణ శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
సినిమాలు, రాజకీయాలు, విదేశీ వ్యవహారాలకు చెందిన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం అందక పోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. ఆధ్యాత్మిక, సేవా రంగాల వారికి ప్రోత్సాహకరమైన రోజు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. పెట్టుబడులు, నిధుల సేకరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పరమశివుని ఆరాధన శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఉన్నత పదవులు అందుకుంటారు. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సినిమాలు, రాజకీయాలు, ప్రభుత్వ రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరంలో ఉన్న పెద్దల సహకరారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. శివ అ ష్టోత్తర శతనామార్చన శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. శివుని ఆరాధించండి.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
రుణప్రయత్నాలు, పెట్టుబడుల విషయంలో పెద్దవారి సహకారం లభిస్తుంది. పన్నులు, బీమా, పెన్షన్, గ్రాట్యుటీ వ్యవహారాలకు అనుకూలం. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
జనసంబధాలు విస్తరిస్తాయి. సమావేశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు సంకల్పం నెరవేరుతుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పందాలు, పోటీల్లో నష్టపోయే అవకాశం ఉంది. శివ పంచాక్షరిని జపించండి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - Oct 28 , 2024 | 06:06 AM