Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో అంచనాలు ఫలిస్తాయి !
ABN, Publish Date - Jul 01 , 2024 | 07:00 AM
నేడు(01-07-2024-సోమవారం) ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. నిధుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
నేడు(01-07-2024-సోమవారం) ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. నిధుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. నిధుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలుకు అవసరమైన నిదులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఫర్చీచర్, నిత్యావసరాల వ్యాపారులకు అనుకూలమైన రోజు
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
మెయిల్స్, సందేశాలు ఆనందం కలిగిస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అడ్మిషన్లు లభిస్తాయి. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
దూరప్రయాణాలకు అవసరమైన నిదులు అందుతాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. కళలు, న్యాయ, బోధన, రవాణా, పర్యాటర రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా టుంది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. పెట్టుబడులు తదితర ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్య సాధనలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
పెద్దల సహకారంతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. అనుకున్న పనులు పూర్తి కావడంతో ఆనందంగా ఉంటుంది. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రణాళికాబద్దంగా వ్యవహరించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉన్నత విద్యకు అవసరమైన నిదులు సర్దుబాటవుతాయి. సంకల్పం నెరవేరుతుంది. శివారాధన శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పాత బకాయిలు వసూలవుతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పెద్దలను స్మరించుకుంటారు. పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు పాటించి మంచి ఫలితాలు పొందుతారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ఇతరులను కలుపుకుని మంచి పనులు చేపడతారు. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. మీ సంకల్పం నెరవేరుతుంది.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. వైద్యం, హోటళ్లు, ఫార్మా, సేవల రంగాల వారికి ఆర్థికంగా అనుకూలమైన రోజు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శివారాధన మేలు చేస్తుంది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సంతానం విషయంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. సృజనాత్మక రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం ల భిస్తుంది. గౌరవ, మర్యాదుల లభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి . శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. విందులకు ఏర్పాట్లు చేస్తారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సిబ్బంది నియామకాలకు అనుకూలం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. చిన్నారులకుసంబంధించిన సమాచారం అనందం కలిగిస్తుంది. శుభవార్త అందుకుంటారు. స్నేహానుబంధాలు పెంపొందుతాయి. వాహనయోగం ఉంది. శివారాధన శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - Jul 01 , 2024 | 07:16 AM