ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి.

ABN, Publish Date - Aug 03 , 2024 | 05:15 AM

నేడు (03-08-2024- శనివారం) దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

నేడు (03-08-2024- శనివారం) దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆద్దె, స్థలం కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి.


వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి అడుగువేయాలి. ఇల్లు, స్థలసేకరణకు సంబంధించిన చర్చలకు తగిన సమయం కాదు. ప్రయాణాల్లో నిదానం పాటించాలి. తోబుట్టవులతో కుటుంబ విషయాలు చర్చకు వస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.


మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల కోసం ఖర్చులు అంచనాలు మించిపోతాయి. పెట్టుబడులకు సంబంధించిన పత్రాల విషయంలో జాగ్రత్తలు అవసరం. బిల్లులు, ఫీజులు చెల్లించేందుకు సకాలంలో నిధులు అందుకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి.


కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగవు. ధనార్జనకు సంబంధించిన కొత్త ఆలోచనలు చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పారాయణ శుభప్రదం.


సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

వీసా, పాస్‌పోర్డ్‌ వ్యవహారాల్లో ఆనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయ, సినీ, న్యాయ రంగాల వారు ఆచితూచి ముందడుగు వేయాలి. లక్ష్య సాధనకు అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. మనసు చికాకుగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.


కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల ఆంతరంగిక విషయాలపై దృష్టి పెడతారు. ఆర్థిక విషయాల్లో అనుకోని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బృంద కార్యక్రమాలు కోసం ఖర్చులు అఽధికం. విరాళాలు, దానధర్మాలకు వెచ్చిస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.


తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకల విషయంలో తల్లిదండ్రుల సహకారం లోపిస్తుంది. పదిమందిలో మీ గౌరవానికి భంగం కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పారాయణం శుభప్రదం.


వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. అందుకోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు, చర్చలు మంచి ఫలితాలనిస్తాయి. పెద్దల సహకారంతో ఉన్నత విద్యాపరమైన లక్ష్యాలు సాధిస్తారు.


ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పన్నులు, బీమా, పెన్షన్‌కు సంఽబంధించిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రుల ఆరోగ్యం కలవరపెడుతుంది. బిల్లులు, ఫీజుల చెల్లింపులకు కావలసిన నిదులు సర్దుబాటవుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఖర్చులు అంచనాలు మించతుతాయి. శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం కలవరపెడుతుంది. పెట్టుబడులకు సంబంధించిన కీలక నిర్ణయాలకు ఇది తగిన సమయం కాదు. ఆర్థిక విషయాల్లో బందుమిత్రుల వైఖరి ఆ వేదన కలిగిస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం శుభప్రదం.


కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

కొత్త పరిచయాలు ఆనందం కలిగిస్తుంది. సన్నిహితుల ఆ రోగ్యం కలవరపెడుతుంది. కంపెనీలు, వ్యవసాయం, హోటల్‌ రంగాల వారు భాగస్వామి నుంచి చిక్కులు ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో ఖ ర్చులు అధికం. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతమలు ఆరోగ్యం కలవరపెడుగుంది. క్రీడలు, బ్యాంకులు, చిట్‌ఫండ్‌లు, విద్యా రంగాల వారు లక్ష్య సాధనకు అ ధికంగా శ్రమించాలి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Aug 03 , 2024 | 05:15 AM

Advertising
Advertising
<