Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగదు.
ABN, Publish Date - Dec 07 , 2024 | 02:18 AM
నేడు (07-12-2024-శనివారం) బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.
నేడు (07-12-2024-శనివారం) బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలు, బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. సన్నిహితుల వైఖరి ఉ ల్లాసం కలిగిస్తుంది. గోసేవ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పారాయణ శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
సంకల్ప సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. న్యాయ, బోధన, రక్షణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
వడ్డీ వ్యాపారులు, ట్రేడర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారపానీయాల్లో నియామాలు పాటించడం అవసరం. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
అనుబంధాలు బలపడతాయి. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ నిర్ణయాలకు అనుకూల సమయం. పందాలు, పోటీలు, షేర్ ట్రేడింగ్లలో మంచి ఫలితాలు సాధిస్తారు.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీలు, మార్పులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. కేటరింగ్, సేవలు, ఫార్మా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
బంధువులను కలుసుకుంటారు. వాట్సాప్ సందేశాలు, మెయిల్స్ అనందం కలిగిస్తాయి. ప్రియతముల మాటతీరు ఆవేదన కలిగిస్తుంది. ప్రకటనలు, చిట్ఫండ్లు, విద్యాసంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాతకోతలు, ప్రయాణాలకు అనుకూలం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
వేడుకలుకు ఏర్పాట్లు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారంతో ముందడుగు వేస్తారు. ఫర్నీచర్ కొనుగోలు చేస్తారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
అన్నదమ్ముల విషయంలో శుభపరిణామాలు సంభవం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. ఒక సమాచారం అనందం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు విషయంలో తొందరపాటు తగదని గ్రహించండి. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. బకాయిలు వసూలవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై మాత్రమే దృష్టి పెట్టండి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
పదిమందికి ఉపయోగపడే పనులు చేపడతారు. సహకారం సంఘాలు, యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. రాజకీయ, సిన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఊరటనిస్తాయి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - Dec 07 , 2024 | 02:18 AM