Today Horoscope : ఈ రాశి వారు వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు!
ABN, Publish Date - Sep 14 , 2024 | 02:22 AM
నేడు (14-09-2024- శనివారం) ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేడుకల్లో పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
నేడు (14-09-2024- శనివారం) ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేడుకల్లో పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేడుకల్లో పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలుసుకుంటారు. వారి అండదండలతో విజయం సాధిస్తారు. ఉన్నత పదవులు అందుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరమైన రోజు. గోసేవ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. దూరంలో ఉన్న బందుమిత్రుల నుంచి ఉల్లాసం కలిగించే సమాచారం లభిస్తుంది. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. లక్ష్యాలు సాధిస్తారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. రుణాలు మంజూరవుతాయి. గతం గుర్తు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగవుతుంది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
సన్నిహితులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. విలువైన పత్రాలు చేతికి అందుతాయి. అనుబంధాలు బలపడతాయి. పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఫార్మా, హోటళ్లు, కేటరింగ్ రంగాల వారికి ఆర్థికంగా అనుకూలమైన రోజు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ వేంకటేశ్వర కవచ పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిన్నారుల విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం..
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
దూర ప్రయాణాల కోసం ఏర్పాట్లు చేసుకంటారు. విద్యా సంస్థల్లో ప్రవేశం, హాస్టళ్లలో వసతి లభిస్తుంది. వారసత్వ వ్యవహరాలు కొలిక్కి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనతో వ్యవహరించి మంచి పరిష్కారం కనుగొంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
బిల్లులు మంజూరవుతాయి. విలువైన పత్రాలు, చెక్కులు అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలకు అనుకూలం. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. స్టేషనరీ, రవాణా, బోధన రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో పెద్దలు, పైఅధికారుల సహకారం లభిస్తుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య కోసం దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. పాస్పోర్ట్, వీసా వ్యవహారాలకు అనుకూలం. రక్షణ, బోధన, న్యాయ, కన్సల్టెన్సీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరమైన రోజు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పాతబకాయిలు వసూలవుతాయి. యోగ, ధ్యానాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్పెక్యులేషన్లలో లాభాలు ఆర్జిస్తారు. ప్రత్యర్థులపై విజయం లభిస్తుంది.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - Sep 14 , 2024 | 02:22 AM