ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి విద్యార్థులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి !

ABN, Publish Date - Jun 22 , 2024 | 04:15 AM

నేడు (22-06-2024-శనివారం) తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నిస్తారు.

నేడు (22-06-2024-శనివారం) తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నిస్తారు.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ, మర్యాదలు పెంపొందుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పేరుప్రఖ్యాతులు ఆర్జిస్తారు.


వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యాసంస్థల్లో చేరే ప్రయత్నాలు ఫలిస్తాయి. చర్చలు లాభిస్తాయి. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.


మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పన్నులు, బీమా, పెన్షన్‌ వ్యవహారాలు పూర్తి చేస్తారు. రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.


కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

జనసంబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. సంకల్పం నెరవేరుతుంది. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.


సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపార రంగాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. సన్నిహితుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. దూరప్రాంతాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల ఫలిస్తాయి. విరామ కాలక్షేపాలు మనసుకు ఊరటనిస్తాయి.


కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకారాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మ్యూచ్యువల్‌ ఫండ్స్‌, షేర్‌మార్కెట్‌ లావాదేవీల్లో లాభాలు ఆర్జిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.


తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పెద్దలు, పైఅధికారుల వైఖరిలో మార్పు గమనిస్తారు. కుటుంబ విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. సంకల్పం నెరవేరుతుంది.


వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

రవాణా, ఏజెన్సీలు, స్టేషనరీ, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. తోబుట్టువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. చర్చలు సఫలం అవుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.


ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి. పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. బీమా, గ్రాట్యుటీ, పెన్షన్‌ పనులు పూర్తవుతాయి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు.


మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వ్యవహారాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం. స్పెక్యులేషన్లలో మంచి లాభాలు గడిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.


కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

దూరప్రాంతాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగులకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకుంటారు. యోగధ్యానాల ద్వారా ఆరోగ్యం పెంపొందించుకుంటారు. ఉపాథి అవకాశాలు పెంపొందుతాయి.


మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బృంద కార్యక్రమాల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. క్రీడలు, ఆర్థికరంగాల వారికి సమావేశాలు లాభిస్తాయి. విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jun 22 , 2024 | 04:15 AM

Advertising
Advertising