ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope : ఈ రాశి వారు చర్చల్లో నిదానం పాటించడం అవసరం

ABN, Publish Date - Dec 05 , 2024 | 06:36 AM

నేడు (5-12-2024 - గురువారం) అనుకున్న పనులు పూర్తవుతాయి. రాజకీయ, సినీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు.

నేడు (5-12-2024 - గురువారం) బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రదర్శనలు, యూనియన్‌ వ్యవహారాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రదర్శనలు, యూనియన్‌ వ్యవహారాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ప్రయాణాలు, సమావేశాల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.


వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

బోనస్‌లు అందుకుంటారు. మెడికల్‌ క్లెయిములు పరిష్కారం అవుతాయి. వైద్యం కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెద్దల ఆ రోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. గాయత్రీ మాత ఆరాధన శుభప్రదం.


మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమావేశాల్లో శ్రమాధిక్యం కలుగుతుంది. రవాణా, న్యాయ, బోధన రంగాల వారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం.


కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్శ చూపించాలి. వైద్యం, పన్నులు, మరమ్మతులు, హార్డ్‌వేర్‌ రంగాల వారికి వృత్తిపరమైన లక్ష్య సాధనలో అడ్డంకులు ఎదురవుతాయి. దత్తకవచ పారాయణ శుభప్రదం.


సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమానుబంధాలు బలపడతాయి. చిన్నారుల విషయంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. గోసేవ శుభప్రదం


కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సహోద్యోగుల వైఖరిలో మార్పు గమనిస్తారు. చేపట్టిన పనులను ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం.


తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులు అరఽశద్ధ కారణంగా ఆశించిన ఫలితాలు సాధించలేకపోతారు. రవాణా, కమ్యూనికేషన్లు, క్రీడలు, విద్యా రంగాల వారు నిదానం పాటించాలి. ప్రియతమలు నుంచి శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. దత్తకవచ పారాయణ శుభప్రదం.


వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఇల్లు, స్థలసేకరణకు అవసరమైన నిధులు సకాలంలో అందుకపోవడంతో ఇబ్బంది పడతారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగస్తుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం.


ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు, చర్చల్లో నిదానం పాటించడం అవసరం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. దత్తకవచ పారాయణ శుభప్రదం.


మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల కారణంగా అశాంతికి లోనవుతారు. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక విషయాలకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకుంటారు. గాయత్రీ మాత ఆరాధన శుభప్రదం.


కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ఆచితూచి ముందడుగు వేయాలి. సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. యూనియన్‌ వ్యవహారాలు, ఆర్థిక సంస్థలతో పనులకు అనుకూలం. దత్త కవచ పారాయణ శుభప్రదం.


మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఎగుమతులు, ఫొటోగ్రఫీ, టెక్స్‌టైల్స్‌ రంగాల వారు లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదుర్కొంటారు. పెద్దల ఆ రోగ్యం కలవరపెడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Dec 05 , 2024 | 06:36 AM