ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశుల వారికి ముఖ్య గమనిక

ABN, Publish Date - Jul 09 , 2024 | 06:16 AM

నేడు (09-07-2024- మంగళవారం ) వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకోని చిక్కులు ఎదురవుతాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి.

నేడు (09-07-2024- మంగళవారం) వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకోని చిక్కులు ఎదురవుతాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకోని చిక్కులు ఎదురవుతాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో తలపెట్టిన పనులు పూర్తి కాకపోవడంతో అ సౌకర్యానికి గురవుతారు. శ్రీ సుబ్రహ్మణ్య కవచ పారాయణ శుభప్రదం.


వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

బంధువులను కలుసుకుంటారు. వాట్సాప్‌ సందేశాలు, మెయిల్స్‌ అనందం కలిగిస్తాయి. ప్రియతముల మాటతీరు ఆవేదన కలిగిస్తుంది. ప్రకటనలు, చిట్‌ఫండ్‌లు, విద్యాసంస్థల వారు రాతకోతల్లో, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి.


మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వేడుకలుకు ఏర్పాట్లు చేసుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారంతో ముందడుగు వేస్తారు. ఫర్నీచర్‌ కొనుగోలు చేస్తారు.


కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువులు విషయంలో శుభపరిణామాలు సంభవం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఒక సమాచారం అవేదన కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు విషయంలో తొందరపాటు తగదని గ్రహించండి. శ్రీ సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.


సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. బకాయిలు వసూలవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై మాత్రమే దృష్టి పెట్టండి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.


కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పదిమందికి ఉపయోగపడే పనులు చేపడతారు. సహకారం సంఘాలు, యూనియన్‌ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. శ్రీ సబ్రహ్మణ్య కవచ పారాయణ శుభప్రదం.


తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. అనవసరంగా అపనిందలకు గురికావాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఊరటనిస్తాయి.


వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలు, బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థికపరమైన చర్చల్లో నిదానం అవసరం. సన్నిహితుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది.


ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పూర్వ మిత్రులను కలుసుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో కొంత అసంతృప్తి నెలకొంటుంది. ఆర్థిక విషయాల్లో ప్రముఖుల సహకారం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. హనుమాన్‌ చాలీసా పారాయణ మంచిది.


మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

సంకల్ప సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. న్యాయ, బోధన, రక్షణ రంగాల వారు సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు.


కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఆహారపానీయాల్లో నియామాలు పాటించడం అవసరం. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారులు, ట్రేడర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.


మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

అనుబంధాలు బలపడతాయి. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ నిర్ణయాలకు అనుకూల సమయం. పందాలు, పోటీలు, షేర్‌ ట్రేడింగ్‌లలో జాగ్రత్తలు పాటించడం మించిది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jul 09 , 2024 | 07:40 AM

Advertising
Advertising
<