Zodiac Signs: ఆ రాశి వారి సంకల్పం నెరవేరుతుందట
ABN, Publish Date - May 02 , 2024 | 06:44 AM
నేడు (2-5- 2024 - గురువారం) షేర్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. కార్పొరేట్ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది...
నేడు (2-5- 2024 - గురువారం) షేర్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. కార్పొరేట్ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది...
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
షేర్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. కార్పొరేట్ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బృందకార్యక్రమాలు, ఆర్థిక సమావేశాలకు అనుకూలం. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. గౌరవ పదవులు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ, సినీ రంగాల వారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి విజయం సాధిస్తారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
సంకల్పం నెరవేరుతుంది. రాజకీయాలు, కళలు, రవాణా, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించండి. బీమా, పన్నులు, పెన్షన్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
సంకల్పం నెరవేరుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహ నిర్ణయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, ఆహారరంగ ఉద్యోగులు, వ్యాపారులకు ప్రోత్సాహకరమైన రోజు. సన్నిహితులతో వేడుకల్లో పాల్గొంటారు. కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాదిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, ఆడిటింగ్, కన్సల్టెన్సీ, సాహిత్య రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మూచ్యువల్ ఫండ్స్, పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులకు అనుకూల సమయం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులను సమీక్షించుకుంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ సామగ్రి వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. మార్కెటింగ్ రంగంలోని వారికి కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఏజెన్సీలు, స్టేషనరీ, రవాణా రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకులు, ట్ఫండ్ రంగాల వారికి అనుకూల సమయం. పెట్టుబడులు, పొదుపు పధకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రి యల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూలం. మీ మనసు మార్పు కోరుకుంటుంది. మీ ఆలోచనలను సమీక్షించుకుంటారు.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు ఉ ల్లాసం కలిగిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ యానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాఇయ. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, ఉన్నత విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - May 30 , 2024 | 07:26 AM