ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Horoscope Today: ఈ రాశుల వారు ఆ విషయంలో నేడు శుభవార్త వింటారు..

ABN, Publish Date - Apr 13 , 2024 | 10:55 AM

నేడు ( 13-04-2024శనివారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం...

నేడు ( 13-04-2024 శనివారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం...

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. రవాణా, బోధన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.


వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. దూరప్రాంతాల్లో చదివేందుకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్‌, కన్సల్టెన్సీ, ఎగుమతుల రంగాల వారికి అనుకూలమైన రోజు.


మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పదిమందిలో మంచిపేరు తెచ్చుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.


కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆఽథ్మాత్యిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

వేడుకలు ఆనందం కలిగిస్తాయి. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. బృందకార్య్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గుడపుతారు.


కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పెద్దలను స్మరించుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బోనస్‌లు, ఇంక్రి మెంట్లు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. రక్షణ, బోధన, న్యాయ, ప్రచురణల రంగాల వారికి అనుకూలమైన రోజు. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. చర్చలు ఫలిస్తాయి.


వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి సకాలంలో చేతికి డబ్బు అందుతుంది. ఆస్పత్రులు, ఫార్మా, బ్యాంకింగ్‌, మరమ్మతుల రంగాల వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గోసేవ మేలు చేస్తుంది.


ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వివాహాది శుభకార్యాలకు అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. శ్రీవారు, శ్రీమతి విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

విందుల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఫార్మా, వైద్యం, వ్యవసాయం, హోటల్‌, క్యాటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది.


కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. చిన్నారులు, ప్రియతముల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. శ్రీ దత్త కవచ పారాయణ శుభప్రదం.


మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. భూమి, ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు.

Updated Date - Apr 13 , 2024 | 10:57 AM

Advertising
Advertising