ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Railway Jobs: రైల్వేలో 9 వేల ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల

ABN, Publish Date - Feb 13 , 2024 | 07:59 PM

ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. 9 వేల పైచిలుకు టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. 9 వేల టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 9 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌లు సబ్మిట్ చేసేందుకు చివరి తేది ఏప్రిల్ 8.

వివరాలు..

  • టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ -1100 పోస్టులు

  • టెక్నీషియన్ గ్రేడ్ 3 -7900 పోస్టులు

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో నిర్వహిస్తారు. తొలి రెండు దశలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ టెస్టులు). మూడో దశలో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, నాలుగో దశలో మెడికల్ టెస్టు ఉంటుంది.

సీబీటీ స్టేజ్ 1 పరీక్ష: జనరల్ ఎవేర్‌నెస్, మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు ఉంటాయి.

సీబీటీ స్టేజ్ 2: ఇందులో రెండు భాగాలు ఉంటాయి.

  • పార్ట్ ఏ: జనరల్ ఎవేర్‌నెస్, మ్యాథ్స్, రీజనింగ్

  • పార్ట్ బీ: సబ్జెక్ట్ సంబంధిత టెక్నికల్ ప్రశ్నలు

ఈ రెండు పరీక్షల్లో పాసైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.

అప్లికేషన్ ఫీజు

  • జనరల్ అభ్యర్థులు (పురుష అభ్యర్థులు) - రూ.500

  • ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ (పురుష అభ్యర్థులు) - రూ.250

  • ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ (మహిళా/ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు ) - రూ.250

  • ఆన్‌లైన్‌లో చెల్లింపు

Updated Date - Feb 13 , 2024 | 08:04 PM

Advertising
Advertising