ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాంగ్రెస్‌ ఖాతాల నుంచి రూ.65 కోట్లు విత్‌డ్రా

ABN, Publish Date - Feb 22 , 2024 | 04:47 AM

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వేర్వేరు బ్యాంకు ఖాతాల నుంచి ఆదాయపు పన్ను శాఖ రూ.65కోట్లు విత్‌డ్రా చేసిందని ఆ పార్టీ మండిపడింది.

  • సొమ్ములు తీసేసుకున్న ఆదాయ పన్ను శాఖ

  • ఐటీ రిటర్న్స్‌ కేసు కోర్టులో ఉండగా ఇదేం పద్ధతి

  • ఐటీ శాఖ తీరు అప్రజాస్వామికం: అజయ్‌ మాకెన్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వేర్వేరు బ్యాంకు ఖాతాల నుంచి ఆదాయపు పన్ను శాఖ రూ.65కోట్లు విత్‌డ్రా చేసిందని ఆ పార్టీ మండిపడింది. ఈ చర్య అప్రజాస్వామికమని, గత సంవత్సరాల పన్ను రిటర్న్‌లకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఈ విధంగా వ్యవహరించడమేంటని నిలదీసింది. దర్యాప్తు సంస్థల చర్యలను కేంద్రం అడ్డుకోకపోతే దేశంలో ప్రజాస్వామ్యం పతనమైపోతుందని ఏఐసీసీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌ హెచ్చరించారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఖాతాల జప్తుపై అప్పిలేట్‌ అధికారులు కేసు విచారణ చేపడుతున్నప్పటికీ కాంగ్రెస్‌, ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ ఖాతాల నుంచి రూ.65 కోట్లు డీడీల రూపంలో విత్‌డ్రా చేయాలని బ్యాంకులకు ఐటీ శాఖ లేఖలు రాసిందని ఆరోపించారు.

గత పన్ను రిటర్నుల్లో వ్యత్యాసాలకు సంబంధించి రూ.210కోట్ల రికవరీపై తమ పార్టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా స్టే విధించిందని, అయినా కూడా తమ ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తూ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారని మాకెన్‌ తెలిపారు. ‘కేంద్ర సంస్థల చర్యలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇది దేశంలో బహుళ పార్టీ వ్యవస్థకు ముప్పు కలిగిస్తుంది. న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకపోతే మన ప్రజాస్వామ్య సూత్రాలు ప్రమాదంలో పడతాయి’ అని ‘ఎక్స్‌’లో చేసిన పోస్టులో మాకెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ వ్యవహారంపై బుధవారం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో వాదనలు కొనసాగగా, తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.

Updated Date - Feb 22 , 2024 | 11:33 AM

Advertising
Advertising