ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టే

ABN, Publish Date - Nov 07 , 2024 | 07:58 PM

కొన్ని లక్షణాలను బట్టి పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నామని చెప్పవచ్చు. దీంతో, మనపై మనకు నమ్మకం పెరిగి మరింత పరిపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదించవచ్చు. మరి పూర్తి ఆరోగ్యం ఉందని చెప్పే లక్షణాలు ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఒంట్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి లక్షణాలు అనేక రకాలుగా బయటపడుతుంటాయి. అయితే, కొన్ని లక్షణాలను బట్టి పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నామని చెప్పవచ్చు. దీంతో, మనపై మనకు నమ్మకం పెరిగి మరింత పరిపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదించవచ్చు. మరి పూర్తి ఆరోగ్యం ఉందని చెప్పే లక్షణాలు (Health) ఏంటంటే..

Kapalabhati: కపాలభాతి ప్రాణాయామంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

మూత్రం లేత పసుపు పచ్చ రంగులో ఉందంటే శరీరంలో తగినంత నీరు ఉందని, కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు భావించాలి. ముదురు రంగులో ఉంటే మాత్రం అనారోగ్యం ఉన్నట్టు భావించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.


మలవిసర్జన క్రమం తప్పకుండా జరుగుతోందంటే జీర్ణవ్యవస్థ పూర్తి ఆరోగ్యంతో పనిచేస్తున్నట్టే. ఆరోగ్యవంతులు రోజు విడిచి రోజు మలవిసర్జన చేయడం కూడా సాధారణమని వైద్యులు చెబుతున్నారు. ఇవి కాక ఇతరత్రా మార్పులేమైనా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Viral: పురుషుల్లో క్యాన్సర్! ఈ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి!

పెదవులు తేమతో సున్నితంగా ఉంటే మాత్రం శరీరంలో తగినంత నీరు ఉందని, విటమిన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా అందుతున్నాయని అర్థం.

మహిళల్లో నెలసరి క్రమం తప్పకుండా వస్తోందంటే పునరుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నట్టు భావించాలి. హార్మోన్ల సమతౌల్యం ఉందనేందుకు నెలసరి సక్రమంగా రావడం ఓ సంకేతం

బరువులో హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా ఉండటం కూడా ఆరోగ్యానికి సంకేతం. అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నా తగ్గుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. బరువుల్లో హెచ్చుతగ్గులు..అంతర్లీనంగా ఉన్న అనారోగ్యం ముఖ్య లక్షణం

ఇక ఆహారం తిన్న తరువాత కాస్త కడుపుబ్బరం, లేదా గ్యాస్ వంటివన్నీ జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తోందనేందుకు సంకేతాలు.

Health: బరువు తగ్గేందుకు నడకకు మించిన ఎక్సర్‌సైజు లేదు! ఎందుకంటే..

చిన్న చిన్న గాయాలు త్వరగా మానిపోతున్నాయంటే శరీరంలో పూర్తి స్థాయి ఆరోగ్యం ఉన్నట్టే. రోగ నిరోధక వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.

నిద్రలేచాక అలసట పూర్తిగా దూరమైతే శరీరంలో ఎటువంటి అనారోగ్యాలు లేనట్టే. నిద్ర సరిగా పట్టకపోతే అంతర్గతంగా ఏదో అనారోగ్యం పీడిస్తోందని అర్థం. ఇలాంటి వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.


గోళ్లు, జుట్టు బలంగా ఉండటం కూడా పూర్తిస్థాయి ఆరోగ్యానికి ముఖ్య సంకేతం. నల్లగా మెరిసే జుట్టు, సులువుగా విరిగిపోకుండా బలంగా మెరిసే గోళ్లు వంటివన్నీ కూడా మంచి ఆరోగ్యానికి సంకేతాలు.

ఎప్పుడో గానీ అనారోగ్యాలు రాకపోవడం కూడా పూర్తిస్థాయి ఆరోగ్యానికి సంకేతం. శరీరంలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నాయని అర్థం

Viral: రోజూ ఈ టైంలో 15 నిమిషాల పాటు ఎండలో నిలబడితే సమృద్ధిగా విటమిన్ డీ!

Read Latest and Health News

Updated Date - Nov 07 , 2024 | 07:58 PM