Viral: పురుషుల్లో క్యాన్సర్! ఈ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి!
ABN, Publish Date - Nov 03 , 2024 | 07:40 AM
పురుషుల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వచ్చే మార్పులను ఓ కంట కనిపెడుతూ ఇబ్బంది తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తే భారీ ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఏసీఎస్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు తమ జీవితకాలంలో క్యాన్సర్ బారినపడతారట. అంతేకాకుండా, పురుషుల జీవనశైలి కారణంగా వారిలో క్యాన్సర్ అవకాశాలు మహిళల కంటే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో అధికశాతం మంది ప్రోస్ట్రేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారట. అయితే, క్యాన్సర్ వచ్చే ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ముందే గుర్తిస్తే సమస్యను సులువుగా పరిష్కరించొచ్చని కూడా భరోసా ఇస్తున్నారు. నిపుణులు చెప్పే దాని ప్రకారం శరీరంలో వచ్చే కొన్ని మార్పులను క్యాన్సర్‌కు సంకేతాలుగా భావించాలి (Signs of Cancer).
Health: బరువు తగ్గేందుకు నడకకు మించిన ఎక్సర్‌సైజు లేదు! ఎందుకంటే..
కాలకృత్యాల సమయాల్లో మార్పులు వస్తున్నా, మల మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉంటున్నా అది బ్లాడర్ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్‌గా అనుమానించాలి. డయేరియా లేదా మలబద్ధకం, మలమూత్ర విసర్జన సమయంలో రక్తం పడుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
గొంతులో లేదా ఛాతిలో మంట సుదీర్ఘకాలం కొనసాగినా అనుమానించాల్సిందే. ఏదో మసాలా ఆహారం తింటే ఇలా జరిగిందంటూ నిర్లక్ష్యం చేయకూడదు. వయసు మీద పడుతున్న కొద్దీ అరుగుదల లోపం లేదా ఆహారం మింగడంలో ఇబ్బంది సహజమని కూడా సర్దుకుపోకూడదు. ఇవన్నీ అన్నవాహిక, కడుపు లేదా గొంతు క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది.
Organic Foods: ఆర్గానిక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయా? వైద్యుల చెప్పేదేంటంటే..
ధూమపానం, గుట్కా, వేపింగ్ వంటి అలవాట్లు ఉన్న వారు నిత్యం తమ నోట్లో వచ్చే మార్పులపై ఓ కన్నేసి ఉంచాలి. నోట్లో లేదా నాలిక మీద తెల్లని మచ్చలు క్యాన్సర్‌కు ముందస్తు దశ కావచ్చు. వీటిని నిర్లక్ష్యం చేసే నోటి క్యాన్సర్ కింద మారే ప్రమాదం ఉందది.
నోరు, పెదాలు, బుగ్గులపై తరచూ పుళ్లు ఏర్పడటం, మొద్దుబారినట్టు ఉండటం, లేదా అకారణంగా రక్తస్రావం కావడం వంటివన్నీ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంది.
వయసు పెరిగే కొద్దీ బరువు పెరగడం కూడా సహజమే. ఇందుకు విరుద్ధంగా అకారణంగా బరువు తగ్గుతున్నట్టైతే వెంటనే అప్రమత్తం కావాలి. ఈ పరిస్థితికి క్యాన్సర్ కూడా ఓ కారణం కావచ్చు
శరీరంలో కణుతులు ఏర్పడినప్పుడు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వృషణాలు, ఇతర భాగాల్లో కణతులు ఏర్పడుతున్నాయేమో తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. యువకులు కూడా వీటి బారిన పడే అవకాశం ఉందని కాబట్టి అప్రమత్తతే శ్రీరామ రక్ష.
Viral: రోజూ ఈ టైంలో 15 నిమిషాల పాటు ఎండలో నిలబడితే సమృద్ధిగా విటమిన్ డీ!
Updated Date - Nov 03 , 2024 | 07:40 AM