ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health: ఈ సంకేతాలు కనిపిస్తే.. జీర్ణవ్యవస్థలో సమస్య ఉన్నట్టే!

ABN, Publish Date - Sep 28 , 2024 | 09:12 PM

జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తితే అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, పేగుల్లో వచ్చే ఇబ్బందులపై అవగాహన పెంచుకుని, అవి తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మనిషి జీర్ణ వ్యవస్థ.. రెండో మెదడు లాంటిది.. ఇదీ నిపుణులు చెప్పే మాట. దీన్ని బట్టే జీర్ణవ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యత (Health) ఎంతటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జీర్ణవ్యవస్థ దెబ్బతింటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మానసిక సమస్యలు మొదలు.. ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు, హార్మోన్ల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి రోగాలు కూడా రావొచ్చు. కాబట్టి, జీర్ణవ్యవస్థ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిలో వచ్చే సమస్యలపై అవగాహన పెంచుకుని, ఇబ్బంది తలెత్తిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

Coconut: ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?


కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, మలబద్ధకం, తరచూ కడుపు నొప్పి వంటివి వేధిస్తున్నాయంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు.

పేగుల్లో వివిధ రకాల హితకర బ్యాక్టీరియా ఉంటాయి. వాటిల్లో మార్పులు వస్తే బరువులో హెచ్చు తగ్గులు ఉంటాయి. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలతో ఊబకాయానికి కారణమయ్యే బ్యాక్టీరియా సంఖ్య పేగుల్లో పెరుగుతుంది. చివరకు ఇబ్బందులు మొదలవుతాయి.

జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు ఉంటే చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. పులిపిర్లు, సోరియాసిస్, దురదలు వంటి ఇబ్బందులు వేధిస్తాయి. పేగుల్లోంచి లీకైయ్యే ప్రొటీన్లను రోగనిరోధక శక్తి హానికరమైనవిగా భావించి దాడి ప్రారంభిస్తుంది. దీంతో, ఈ సమస్యలు వస్తాయట.

Protect your Hearing: మీ వినికిడి శక్తి కలకాలం నిలిచుండాలంటే ఇలా చేయండి!


జీర్ణవ్యవస్థలో సమస్యల కారణంగా మానసిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ప్రో బయోటిక్స్‌తో వీటిని కొంత వరకూ నయం చేయొచ్చు.

నిత్యం అలసటగా ఉండటం కూడా జీర్ణవ్యవస్థలో సమస్యలకు సంకేతమని వైద్యులు చెబుతున్నారు. నీరసంతో బాధపడేవారిలో సగం మందికి జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు.

జీర్ణవ్యవస్థ సమస్యలను చక్కదిద్దుకునేందుకు జీవనశైలిలో మార్పులు అవసరమని వైద్యులు చెబుతున్నారు. మంచి పోషకాహారం, మెడిటేషన్, ఎక్సర్‌సైజులు వంటివి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆహారం తినే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆహారాన్ని బాగా నమిలి తింటే చాలా వరకూ జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. క్రమం తప్పకుండా ప్రీ, ప్రో బయోటిక్స్ తీసుకోవడం కూడా పేగులకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Tea-biscuit: ఉదయాన్నే టీ బిస్కెట్‌ తింటే రిస్క్ అని తెలుసా?

Viral: ఉదయాన్నే నీరు తాగితే హ్యాంగోవర్ తొలగిపోతుందా? ఇందులో నిజమెంత?

Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

Read Health and Latest News

Updated Date - Sep 28 , 2024 | 09:19 PM