Recall Method: ఈ టెక్నిక్ ఫాలో అయితే మతిమరుపుపై శాశ్వత విజయం!
ABN, Publish Date - Nov 14 , 2024 | 07:11 PM
మతిమరుపు అందరికీ సహజమే కానీ కొందరిని ఇది కాస్త ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. రికాల్ మెథడ్ అనే విధానాన్ని ఫాలో అయితే మతిమరుపుపై శాశ్వత విజయం సాధించొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మతిమరుపు అందరికీ సహజమే కానీ కొందరిని ఇది కాస్త ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. మనసులో ఉండే కంగారు కూడా దీనికి కొంత వరకూ కారణం. అయితే, ‘రీకాల్ మెథడ్’ అనే విధానాన్ని ఫాలో అయితే మతిమరుపుపై శాశ్వత విజయం సాధించొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరి ఆ టెక్నిక్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).
రీకాల్ (ఆర్ఈసీఏఎల్ఎల్.. అనే ఆంగ్ల పొడి అక్షరాల సమాహారం) టెక్నిక్ ద్వారా చదివినది ప్రతిదీ శాశ్వతంగా గుర్తుంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో మెమరీ పవర్‌ను పెంచుకోవచ్చని భరోసా ఇస్తున్నారు. సైన్స్ కూడా దీన్ని రుజువు చేసిందని అంటున్నారు.
Powernaps: రోజూ మధ్యాహ్నం ఓ కునుకు తీస్తే కలిగే ప్రయోజనాలు ఇవే!
రీకాల్ అక్షర సమాహారంలోని తొలి అక్షరం ఆర్. ఆర్ అంటే రిపిటీషన్ అన్నమాట. అంటే ఒక విషయాన్ని చదివాక కొంత విరామం ఇచ్చి మళ్లీ దాన్నే చదవడం. ఇలా పలుమార్లు చేయడంతో చదివినది మెదడులో సుదీర్ఘకాలం నిలిచుండేలా నిక్షిప్తమైపోతుందట.
రెండో అక్షరం ఈ అంటే ఎన్‌కోడింగ్. దీని ప్రకారం, మనం చదివింది మనకు తెలిసిన విధంగా అవతలి వారికి తిరిగి వివరిస్తే ఆ విషయం ఎక్కువకాలం మెదడులో నిలిచుంటుందట. అవతలి వారికి వివరించే క్రమంలో ఓ విషయాన్ని కూలంకషంగా అర్థంచేసుకుని క్రమపద్ధతిలో గుర్తుపెట్టుకుంటామని, ఫలితంగా మెదడులో ఈ విషయం గాఢమైన ముద్ర వేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మూడో అక్షరం సీ అంటే చంకింగ్. ఇందులో భాగంగా గుర్తుంచుకోవాల్సిన అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టాలి. ఒక్కో భాగానికి ఒక్కో అక్షరాన్ని అనుసంధానించి ఆ అక్షరాలను ఓ సమాహారంగా గుర్తుపెట్టుకోవాలి. ఫలితంగా అక్షరాల సమాహారం గుర్తొచ్చిన ప్రతిసారీ వాటికి అనుసంధానమైన ఉన్న అంశాలు కూడా వెంటనే స్ఫూరణకు వస్తాయి.
Immunity Boosters for Winter: చలికాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఫుడ్స్ ఇవే
నాలుగో అక్షరం ఏ అంటే యాక్టివ్ రీకాల్. ఇందులో భాగంగా మనం పేపర్ మీద రాశాక, లేదా చదువుకున్నాక కళ్లుమూసుకుని దాన్ని మళ్లీ గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే ఆయా అంశాలు మెదడులో శాశ్వతంగా గుర్తుండిపోతాయి.
ఐదో అక్షరం ఎల్.. అంటే లోసై మెథడ్. ఇందులో భాగంగా మనం చదివే అంశాలను మన ఎదురుగా ఉన్న ఏదో వస్తువుకు లింక్ చేసుకోవాలి. తద్వారా ఆ వస్తువును చూసిన ప్రతిసారీ దానికి లింక్ చేసి ఉన్న విషయం కూడా మనోఫలకంపై ప్రత్యక్షమవుతుంది.
ఆరో లక్షరం ఎల్.. అంటే లిమినల్ ప్రాసెసింగ్. ఈ టెక్నిక్ ఫాలో అయ్యే వారు ముందుగా తాము చదివేదానిపై పూర్తి శ్రద్ధ పెడతారు. ఆ తరువాత ఓ పది నిమిషాలో పది హేను నిమిషాలు పూర్తిస్థాయిలో రెస్ట్ తీసుకుంటారు. చిన్న కునుకు తీయడం లేదా మనసులో ఎటువంటి ఆలోచలు రాకుండా కట్టడి చేసుకుంటారు. ఇలాచేస్తే విషయాలు చాలా రోజుల పాటు గుర్తుండిపోతాయట. అయితే, ఈ టెక్నిక్‌పై శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేస్తున్నారు.
ఈ రీకాల్ టెక్నిక్ పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఏదైనా పదే పదే చదివితే మెదడుపై గాఢమైన ముద్రపడుతుందని, వాటిని మర్చిపోయే అవకాశాలు క్రమంగా తగ్గిపోతాయని చెబుతున్నారు. ఈ ప్రక్రియలో ఏకాగ్రత ముఖ్యమని తెలిపారు.
Beer: బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..
Updated Date - Nov 14 , 2024 | 07:21 PM