ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Apple Seeds: యాపిల్ విత్తనాలు తింటే చచ్చిపోతారా? పొరపాటున యాపిల్ విత్తనాలు కడుపులోకి వెళితే జరిగేదిదే..!

ABN, Publish Date - Jan 14 , 2024 | 09:27 AM

అందరూ యాపిల్ పండ్లు తింటూనే ఉంటారు. కానీ వాటిలో విత్తనాల గురించి చాలామందికి తెలియని నిజాలివీ..

యాపిల్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. రోజుకొక యాపిల్ తింటే ఆరోగ్యానికి ఢోకా ఉండదని, వైద్యుని ఆవసరం లేదని అంటుంటారు. అయితే యాపిల్ లో ఉండే విత్తనాలు తింటే మాత్రం చచ్చిపోతారని చెబుతారు. కొందరు దీన్ని అపోహాగా కొట్టి పడేస్తారు. యాపిల్ విత్తనాలు తింటే నిజంగానే చచ్చిపోతారా? పొరపాటున యాపిల్ విత్తనాలు తింటే ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే..

ఆరోగ్యం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ యాపిల్ విషయంలో జాగ్రత్తగానే ఉంటారు. యాపిల్ విత్తనాలలో విషం ఉంటుందని, యాపిల్ విత్తనాలు తింటే చావును కొనితెచ్చుకున్నట్టేనని అంటారు. కొందరు దీన్ని కొట్టిపడేస్తారు కూడా. కానీ నిజంగానే యాపిల్ విత్తనాలు ప్రాణాలను తీయగల శక్తివంతమైనవి. యాపిల్ విత్తనాలలో సైనెడ్ అనే విష పదార్థం ుంటుంది. ఇదిమాత్రమే కాకుండా చక్కెరతో కూడిన సైనోజెనిక్ గ్లైకోసైడ్ కు చెందిన అమిగ్డాలిన్ ఉంటుంది. యాపిల్ విత్తనాలు తిన్నప్పుడు ఈ సమ్మేళనాలు అతి విషయపూరితమైన హైడ్రోజన్ సైనైడ్ లుగా రూపాంతరం చెందుతాయి. దీని మోతాదు ఎక్కువైతే నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి.

ఇది కూడా చదవండి: 30ఏళ్ల తర్వాత బలంగా ఉండాలంటే.. తినాల్సిన ఆహారాల లిస్ట్ ఇదీ..!


అయితే యాపిల్ విత్తనాల వల్ల ప్రాణాలు పోయే అవకాశాలు తక్కువే ఉన్నాయి. దీనికి కారణం యాపిల్ విత్తనాలను మింగడం వేరు నమలడం వేరు. యాపిల్ విత్తనాలు మింగినప్పుడు యాపిల్ విత్తనం మీద పొర చాలా బలంగా ఉంటుంది. ఈ కారణంగా విత్తనాలలో ఉండే విషపూరితాలు శరీరాన్ని ఏమీ చెయ్యలేవు. విత్తనాలు మలవిసర్జనలో బయటకు వెళ్లిపోతాయి. కానీ యాపిల్ విత్తనాలు నమిలితే మాత్రం ప్రమాదమే.. అయితే ఒకటి రెండు విత్తనాలు మరీ అంత ప్రమాదం కలిగించవు కానీ తినడంలో లీనమైనపోయి ఎక్కువ విత్తనాలు తింటే మాత్రం అవి ప్రాణాలు తీస్తాయి.

ఇది కూడా చదవండి: అశ్వగంధ పొడిని పాలల్లో కలిపి తాగితే ఇన్ని అద్భుతాలా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 14 , 2024 | 09:27 AM

Advertising
Advertising