Health: రోబోటిక్ సర్జరీలు సేఫేనా?
ABN, Publish Date - Oct 12 , 2024 | 11:20 AM
ఈ తరహా శస్త్రచికిత్సల్లో వైద్యులు అత్యాధునిక రోబోటిక్ పరికరాలతో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. దీంతో, ఆపరేషన్ అత్యంత కచ్చితత్వంతో చేసేందుకు సాధ్యమవుతుంది. సంక్లిష్ట శస్త్రచికిత్సలైన జాయింట్ రిప్లేస్మెంట్‌కు రోబోటిక్ సర్జరీలు ఎంతో అనుకూలమని వైద్యులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రోబోటిక్ సర్జరీలు.. ఇంకా స్పష్టంతా చెప్పాలంటే రోబో సాయంతో చేసే సర్జరీలు. రోబోట్ పేరు కనిపించడంతో ఈ కొత్త విధానంపై సహజంగానే జనాల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఇవి సురక్షితమైనవేనా అని కూడా కొందరు ప్రశ్నిస్తుంటారు. అయితే, పేరుకు రోబోటిక్ సర్జరీ అయినా కూడా ఇందులో డాకర్లు ప్రత్యేక రోబోటిక్ పరికరాల సాయంతో ఆపరేషన్లు చేస్తారని నిపుణులు చెబుతున్నారు (Health).
Coconut Oil: రోజూ ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తాగితే కలిగే ప్రయోజనాలు!
రోబోటిక్ సర్జరీతో ఉపయోగాలు..
ఇందులో భాగంగా వైద్యులు అత్యాధునిక రోబోటిక్ పరికరాలతో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. దీంతో, ఆపరేషన్ అత్యంత కచ్చితత్వంతో చేసేందుకు సాధ్యమవుతుంది. సంక్లిష్ట శస్త్రచికిత్సలైన జాయింట్ రిప్లేస్మెంట్‌కు రోబోటిక్ సర్జరీలు ఎంతో అనుకూలం. రోబోటిక్ పరికరాలు వినియోగించడంతో శరీర భాగాలకు భారీగా కోతలు పెట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో, రక్తస్రావం కూడా తక్కువగా ఉంటుంది. ఆపరేషన్ తరువాత రోగి త్వరగా కోలుకుంటాడు. రోబోటిక్ శస్త్రచికిత్సల్లో సర్జన్లకూ అలసట ఉండదని, ఫలితంగా ఆపరేషన్లు విజయవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయి.
Cakes: కేక్ అంటే ఇష్టపడే వారికి నిపుణులు చేస్తున్న హెచ్చరిక ఇదే!
అయితే రోబోటిక్ సర్జరీలతో ఖర్చు కొంచెం అధికంగా అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా, రోబోటిక్ సర్జరీలు చేసేందుకు వైద్యులు కూడా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందట. అనుభవంలేని వైద్యులు ఇలాంటి సర్జరీలు చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మెకానికల్ ఫెయిల్యూర్‌కు కూడా ఛాన్స్ ఉన్నప్పటికీ ఇది అరుదుగా మాత్రమే జరుగుతుందని అంటున్నారు. అయితే, రోబోటిక్ సర్జరీ అంటే వైద్యులకు ప్రత్యామ్నాయ కాదని, వైద్యులకు సాయం కోసం ఉద్దేశించిన విధానమని కూడా చెబుతున్నారు. అనుభవజ్ఞులైన డాక్టర్లు రోబోటిక్ సర్జరీలతో మంచి ఫలితాలు రాబట్టగలుగుతారని చెబుతున్నారు.
Snoring: రాత్రి గురకతో నిద్ర చెడిపోతోందా? ఇలా చేస్తే సమస్య నుంచి విముక్తి!
Updated Date - Oct 12 , 2024 | 11:20 AM