ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cancer: పొడుగ్గా ఉండే వాళ్లల్లో క్యాన్సర్ అవకాశాలు ఎక్కువా?

ABN, Publish Date - Sep 08 , 2024 | 02:09 PM

క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉన్నాయి. అయితే, పొడుగు కూడా క్యాన్సర్‌కు ఓ కారణం అయ్యుండే అవకాశం కొట్టిపారేయలేమని ఎవరైనా అంటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. అయితే, వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ సంస్థ ఇలాంటి అనుమానమే తాజాగా వ్యక్తం చేయడంతో ఈ విషయం ప్రస్తుతం శాస్త్రవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉన్నాయి. అయితే, పొడుగు కూడా క్యాన్సర్‌కు ఓ కారణం అయ్యుండే అవకాశం కొట్టిపారేయలేమని ఎవరైనా అంటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. అయితే, వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ సంస్థ ఇలాంటి అనుమానమే తాజాగా వ్యక్తం చేయడంతో ఈ విషయం ప్రస్తుతం శాస్త్రవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మనిషి పొడవుకు, క్యాన్సర్ వచ్చే అవకాశాలకు సంబంధం ఉందని క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ పేర్కొంది. పొడుగ్గా ఉండే వాళ్లల్లో పాంక్రియాస్, పెద్ద పేగు, ఎండోమెట్రియమ్, అండాశయాలు, ప్రోస్టేట్, కిడ్నీ, చర్మ, బ్రెస్ట్ సంబంధిత క్యాన్సర్లు రావచ్చని అంచనా వేసింది (Health).

ప్రపంచంలో 60 శాతం మందికి పైగా చేస్తున్న తప్పు ఇది.. మీరు చేయొద్దు


క్యాన్సర్‌కు పొడవుకు సంబంధం ఇదీ..

శరీరంలో పాత కణాల స్థానంలో కొత్త కణాలు వచ్చేందుకు కణ విభజన జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సహజంగా జరిగే కొన్ని పొరపాట్ల కారణంగా ప్రమాదకరమైన జన్యువులు పుట్టకొస్తాయి. ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయి. అయితే, పొట్టి వారికంటే పొడుగు ఉన్న వ్యక్తుల్లో కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ కారక కణాలు పుట్టుకొచ్చే అవకాశం ఎక్కువని శాస్త్రవర్గాల్లో ఓ సిద్ధాంతం ప్రచారంలో ఉంది. ఇక మహిళల కంటే పురుషులకు క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండటం ఈ సిద్ధాంతానికి బలం చేకూరుస్తోంది. మహిళల కంటే పురుషుల సగటు ఎత్తు ఎక్కువ కాబట్టి క్యాన్సర్ అవకాశాలు పెరిగుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


అయితే, క్యాన్సర్‌కు పొడవుకు సంబంధం ఉన్నప్పటికీ దాని తీవ్రత తక్కువగానే ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, క్యాన్సర్‌కు ఇతర అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇక నిపుణుల ప్రకారం, క్యాన్సర్ రిస్క్ తగ్గించుకునేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించాలి. పళ్లు, కూరగాయలు, పప్పుదినుసులు వంటి పోషకాహారం తీసుకోవాలి. వారానికి కనీసం 150 నిమిషాల పాటు ఎక్సర్‌సైజులు చేయాలి. ధూమపానం, మద్యపానం, ఎక్కువగా ఎండలో గడపడం వంటివాటికి దూరంగా ఉంటే క్యాన్సర్ ప్రమాదం చాలా వరకూ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

Read Health and Telugu News

Updated Date - Sep 08 , 2024 | 02:18 PM

Advertising
Advertising