ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Coconut Oil: రోజూ ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తాగితే కలిగే ప్రయోజనాలు!

ABN, Publish Date - Oct 12 , 2024 | 09:45 AM

రోజూ ఒక టీ స్పూను కొబ్బరి నూనె తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుందని, మెదడు సామార్థ్యం పెరుగుతుందని అంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: కొబ్బరి చెట్టుకు కల్ప వృక్షం అని పేరు. అంటే.. అన్ని జీవనానికి కావాల్సిన పోషకాలన్నీ అందించేదని అర్థం. ఆయుర్వేదంలో కొబ్బరి నూనెకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రోజూ ఒక టీస్పూను కొబ్బరి నూనె తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయట (Health). అవేంటంటే..

  • కొబ్బరినూనె తినే వాళ్లు ఉల్లాసంతో తోణికిసలాడుతుంటారట. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మూడ్‌ను మెరుగుపరుస్తాయట.

Cakes: కేక్ అంటే ఇష్టపడే వారికి నిపుణులు చేస్తున్న హెచ్చరిక ఇదే!


  • ఇతర కొవ్వు పదార్థాలతో పోలిస్తే కొబ్బరి నూనెలోని కొవ్వులు క్షణాల్లో శక్తిని అందిస్తాయి. కడుపులో భారంగా ఉన్న భావనే కలగదు. ఇది తినే వారు రోజంతా హుషారుగా ఉంటారు.

  • కొబ్బరి నూనె థైరాయిడ్ గ్రంధీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులోని మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్‌ కడుపులో సులువుగా అరిగిపోయి వేగంగా శక్తిని విడుదల చేస్తాయి. ఈ నూనెతో జీవక్రియలు కూడా వేగవంతమవుతాయి. కొలెస్టెరాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.

AGE Compounds: భారతీయులకు ఈ ఫుడ్స్ వల్లే షుగర్.. ఐసీఎమ్ఆర్ అధ్యయనంలో వెల్లడి


  • చర్మానికి తగినంత తేమ అందించడంలో కొబ్బరి నూనెకు మించినది లేదని నిపుణులు చెబుతారు. దీంతో, చర్మం పడిబారడం అనే సమస్య దూరమవుతుంది.

  • కొబ్బరినూనెలోని యాంటీమైక్రోబియల్, యాంటీవైరల్ గుణాలతో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఇక ఆయిల్ పుల్లింగ్తో నోటి ఆరోగ్యం మెరుగవుతుందన్న విషయం తెలిసిందే.

ఇలా కొబ్బరి నూనెలో అనేక ప్రయోజనాలు ఉండడంతో ఈ నూనెలకు ఆయుర్వేదంలో అమిత ప్రాధాన్యం దక్కిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నూనెను రోజూ వినియోగిస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని అంటున్నారు.

Snoring: రాత్రి గురకతో నిద్ర చెడిపోతోందా? ఇలా చేస్తే సమస్య నుంచి విముక్తి!

Read Health and Latest News

Updated Date - Oct 12 , 2024 | 09:45 AM