Turmeric water: ఉదయాన్నే పసుపు నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు!
ABN, Publish Date - Oct 28 , 2024 | 08:02 AM
ఉదయాన్నే పసుపు నీరు తాగితే ఊబకాయం మొదలు డయాబెటీస్ వరకూ అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వంటకాల్లో ముఖ్య భాగమైన పసుపునకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. క్యాన్సర్‌ను అడ్డుకోవడం మొదలు బరువు నియంత్రణలో ఉంచడం వరకూ పసుపుతో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే, ఉదయాన్నే పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఉదయాన్నే పసుపు నీరుతో కలిగే ప్రయోజనాలు (Health) ఏవంటే..
Diabetes: పండుగల సమయంలో షుగర్ పెరగకూడదంటే డయాబెటిస్ ఉన్నవారు ఇలా చేయాలి..
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్ల బారిన పడ్డప్పుడూ లేదా గాయాలైనప్పుడు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ జనిస్తుంది. ఇది సహజసిద్ధమైన రక్షణ ప్రక్రియ. అయితే సుదీర్ఘకాలం శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ కొనసాగితే అది చివరకు ఆర్థరైటిస్, గుండెజబ్బులు, డయాబెటీస్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది. కానీ పసుపులో ఉండే కుకుర్మిన్ రసాయనం ఈ ఇన్‌ఫ్లమేషన్‌ను అడ్డుకుని శరీరానికి స్వస్థత చేకూరుస్తుంది. కాబట్టి రోజూ ఉదయాన్నే పసుపు నీరు తాగితే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
Black Tea: బ్లాక్ టీ.. ఇలా తాగితే ఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగిపోద్ది..
పసుపు నీటితో రోగ నిరోధక శక్తి కూడా బలోపేతమవుతుంది. ముఖ్యంగా శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌ను పసుపు నిర్వీర్యం చేస్తుంది. ఫ్రీరాడికల్స్ రోగనిరోధకశక్తికి హానికరం. కాబట్టి, పసుపుతో ఫ్రీరాడికల్స్ బెడద తొలగి రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఇన్‌ఫెక్షన్లను అడ్డుకునే సామర్థ్యం ఇనుమడిస్తుంది.
పసుపుతో జీర్ణవ్యవస్థకూ మేలు కలుగుతుంది. కడుపుబ్బరం, గ్యాస్, అరుగుదల లోపాలకు పసుపు చక్కని పరిష్కారం. పసుపు నీటితో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటి ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి.
Coconut Oil Vs Ghee: కొబ్బరి నూనె లేదా నెయ్యి.. జుట్టు పెరుగుదలకు ఏది మంచిదంటే..
ఉదయాన్నే పసుపు నీరు తాగడంతో శరీరంలోని విషతుల్యాలన్నీ తొలగిపోతాయి. దీంతో, లివర్ పనితీరు మెరుగవుతుంది. రక్తంలోని మలినాలన్నీ తొలగిపోవడంతో లివర్‌పై ఒత్తిడి తగ్గుతుంది.
బరువు తగ్గాలనుకుంటున్న వారికీ పసుపు నీటితో లక్ష్యం నెరవేరుతుంది. పసుపులోని కుకుర్మిన్ శరీరంలోని కొవ్వు నిల్వలు కలిగిపోయేలా చేస్తుంది. అంతేకాకుండా, కొత్తగా కొవ్వు పేరుకోకుండా కూడా అడ్డుకుంటుంది. కొవ్వుల వినియోగానికి సంబంధించిన జీవక్రియలను నియంత్రిస్తూ బరువు అదుపులో ఉండేలా చేస్తుంది.
Weight Loss: ఈ 6 టిప్స్ ఫాలో అవ్వండి చాలు.. కిలోల కొద్ది బరువు ఈజీగా తగ్గుతారు..
గాయాలకు చికిత్సగా పసుపు వాడటం మనందరికీ తెలిసింది. చర్మంపై మచ్చలు, మొటిమలు వంటివి తొలగించడంలో కూడా పసుపు ఉపయోగపడుతుంది. సోరియాసిస్, ఎగ్జీమా వంటి చర్మ సమస్య నుంచి పసుపుతో ఉపశమనం కలుగుతుంది. పసుపును ఒంటికి రాసుకోవడంతో పాటు ఉదయాన్నే పసుపు నీళ్లు తాగితే చర్మంలోని మలినాలన్నీ తొలగిపోయి చర్మకాంతి ఇనుమడిస్తుంది. యవ్వనంగా కనిపిస్తుంది.
ఇక డయాబెటీస్ రోగులకు పసుపు దివ్యౌషధం అని నిపుణులు చెబుతున్నారు. రోజూ పసుపు నీరు తాగితే డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పసుపు.. రక్తంలోని చక్కెర నిల్వలు స్థిరంగా ఉండేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - Oct 28 , 2024 | 08:05 AM