Mushrooms: రోజూ కేవలం 5 పుట్టగొడుగులను తింటే కలిగే బెనిఫిట్స్ ఏవంటే..
ABN, Publish Date - Dec 07 , 2024 | 02:56 PM
కెలొరీలు తక్కువగా, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పుట్టగొడుగుల ప్రాముఖ్యతను ప్రపంచం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. కొన్ని పరిశోధనల ప్రకారం, రోజూ ఐదు పుట్టగొడుగుల తినే వారికి హృద్రోగాలు, క్యాన్సర్, మతిమరుపు నుంచి పూర్తి రక్షణ లభిస్తుందట. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం
ఇంటర్నెట్ డెస్క్: పుట్టగొడుగులు రుచిలోనే కాకుండా పోషకాల్లో కూడా సాటిలేనివని అనేక పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. కెలొరీలు తక్కువగా, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పుట్టగొడుగుల ప్రాముఖ్యతను ప్రపంచం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. కొన్ని పరిశోధనల ప్రకారం, రోజూ ఐదు పుట్టగొడుగుల తినే వారికి హృద్రోగాలు, క్యాన్సర్, మతిమరుపు నుంచి పూర్తి రక్షణ లభిస్తుందట (Health).
Tea: టీని తాగడంతో పాటు ఇలాక్కూడా వాడొచ్చని తెలుసా?
పుట్టగొడుగుల్లోని ఔషధ గుణాలకు మూలం ఎర్గోథియోనీన్, గ్లూటాథయోన్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావం నిర్వీర్యం చేయడంలో ఈ రెండూ మంచి పనితీరు కనబరుస్తాయి. ఈ రెండు యాంటీఆక్సిండెట్స్ సమృద్ధిగా లభించే అత్యుత్తమ ఆహారం పుట్టగొడుగులని పెన్ స్టేట్ సెంటర్ ఆఫ్ ప్లాంట్ అండ్ మష్‌రూంలో ప్రాడక్ట్స్ డైరెక్టర్ పేర్కొన్నారు.
Weekend Drinking: దంపతుల లివర్ చిత్రాలు షేర్ చేసిన డాక్టర్! విషయమేంటో తెలిసి జనాలు షాక్!
పుట్టగొడుగులతో కలిగే బెనిఫిట్స్
పుట్టగొడుగుల్లో సోడియం, పొటాషియం నిష్పత్తి తక్కువగా ఉండటంతో వీటిని తింటే బీపీ సులువుగా నియంత్రణలోకి వస్తుంది. ఫలితంగా హృద్రోగాలు దరిచేరవు
పుట్టగొడుగుల్లోని సెలీనియం రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడే శక్తిని ఇస్తుంది.
ఇందులో పీచుపదార్థం, ప్రొటీన్లు ఎక్కువగా ఉండటంతో ఇవి తినే వారికి బరువు ఈజీగా నియంత్రణలో ఉంటుంది.
పుట్టగొడుగుల్లోని ఎర్గోథియోనిన్ యాంటీఆక్సిడెంట్.. కణాలను కాపాడి కొన్ని రకాల క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.
తరచూ వీటిని తినే వారిలో మెదడు సామర్థ్యం కూడా ఇనుమడిస్తుంది. ఆల్జైమర్స్ వంటి డీజెనరేటివ్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
నిపుణులు చెప్పే దాని ప్రకారం, ప్రపంచంలో 14 వేల జాతుల పుట్టగొడుగులు ఉన్నాయి. వీటిలో కొన్ని విషపూరితం. డెత్ క్యాప్, డెస్ట్రాయింగ్ ఏంజెల్స్ వంటివి ప్రాణాంతకం. కొన్నింటికి మత్తు కలిగించే లక్షణం ఉండటంతో వివిధ దేశాలు నిషేధం విధించాయి. అయితే బటన్స్, ఆయిస్టర్స్, షిటేక్స్ వంటివి సురక్షితమైనవే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తప్పక రోజువారి భోజనంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - Dec 07 , 2024 | 03:04 PM