Viral: కుర్చిలో కూర్చునే పొట్టచుట్టూ కొవ్వు కరిగించుకోవచ్చు! ఎలాగంటే..
ABN, Publish Date - Sep 21 , 2024 | 05:12 PM
కుర్చిలో కూర్చుని కూడా పొట్టచుట్టూ ఉన్న కొవ్వును కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐదు పద్ధతులు క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఉపయోగం ఉంటుందని అంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా!
ఇంటర్నెట్ డెస్క్: పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. రకరకాల కసరత్తులు చేసి కూడా పొట్ట సైజు తగ్గించుకోవడంలో విఫలమయ్యే వాళ్లు ఎందరో! సాధారణంగా మన శరీరంలో అనేక చోట్ల కొవ్వు పేరుకుంటుంది. అయితే, పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు (Health). కీలక అవయవాల చుట్టూ పేరుకునే ఈ కొవ్వుతో వాటి పనితీరు దెబ్బతింటుందని, అంతిమంగా దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడతాయి. రోజంతా కుర్చీల్లోనే కదలకుండా కూర్చుంటూ గడిపేసే వాళ్లల్లో సమస్య మరింత జటిలమవుతుంది. కానీ, కుర్చీలో కూర్చుని కూడా ఉదరభాగంలో కొవ్వును కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు (Best ways to lose belly fat while sitting). అదెలాగంటే..
Viral: ఉదయాన్నే నీరు తాగితే హ్యాంగోవర్ తొలగిపోతుందా? ఇందులో నిజమెంత?
సిట్టింగ్ క్రంచెస్!
కుర్చీలో కూర్చుని కూడా పలు కసరత్తులు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులో సిట్టింగ్ క్రంచెస్ ముఖ్యమైంది. ఇందులో భాగంగా కుర్చీ అంచున కూర్చుని కూర్చుని చెతులను తల వెనకభాగంపై పెట్టుకోవాలి. ఆ తరువాత మొకాళ్లను పొట్ట వరకూ వచ్చేలా మడవాలి. ఇలా పలుమార్లు కాళ్లను పైకీ కిందకీ జాపుతూ ఉంటే ఉదరభాగానికి కావాల్సినంత ఎక్సర్‌సైజు అభిస్తుంది. దీంతో, కొవ్వు మటుమాయం అవుతుంది.
Cold Showers: ఉదయాన్నే చన్నీటి స్నానంతో లాభమా? నష్టమా?
బద్ధకోణాసనం
బద్ధకోణాసనంతో కూడా పొట్టు చుట్టూ కొవ్వు కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనంలో భాగంగా ముందు నేలపై కూర్చోవాలి. ఆ తరువాత అరికాళ్లు ఒకదానికొకటి తాకేలా బాసు పెట్టుకుని కూర్చోవాలి. ఆ తరువాత రెండు చేతులను వెనక్కు నేలపై ఆన్చి కాళ్లను పైకీకిందకూ కదుపుతూ ఉండాలి. ఇది ఉదరభాగంలో కండరాలకు మంచి కసరత్తు. దీంతో, కొవ్వు మటుమాయం అయిపోతోంది.
Health: తీరిక లేదని తరచూ తిండి మానేస్తే జరిగేది ఇదే.. జాగ్రత్త!
కూర్చీలో ముందుకు వంగిపోయి కూర్చోకుండా వెన్నెముకను నిటారుగా పెట్టి కూర్చుంటే కూడా పొట్ట చుట్టు ఉన్న కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వెన్నెముక నిటారుగా పెట్టి కుర్చునేందుకు చాలా శక్తి అవసరమని, ఈ పోజుతో రోజుకు అదనంగా 350 కెలొరీలు ఖర్చు చేయొచ్చని అంటున్నారు.
Health: ఆఫీసులో పని ఒత్తిడి.. ఏడాదిలో 20 కిలోల బరువు పెరిగిన మహిళ!
కొవ్వు కరిగించడంలో నీటి పాత్ర ఎంతో ఉంది. కాబట్టి, డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. కూర్చుని నీటిని తాగితే అరుగుదల మెరుగవుతుంది. జీవక్రియలు వేగవంతమై కొవ్వు కరుగుతుంది.
సాధారణంగా మనం కుర్చిలో కూర్చున్నప్పుడు బోర్ కొడితే మొబైల్ ఫోన్ చూస్తూ గడుపుతాం. దీనికి బదులుగా కాలి వేళతో నేలపై అంకెలు వేస్తున్నట్టు కదిపితే చాలా శక్తి ఖర్చవుతుందని, ఫలితంగా పొట్టచుట్టూ కొవ్వుకరగడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
Updated Date - Sep 21 , 2024 | 05:18 PM