Red Wine - Cancer: రెడ్ వైన్ క్యాన్సర్‌ను అడ్డుకుంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ABN, Publish Date - Nov 16 , 2024 | 10:09 PM
రెడ్ వైన్ తీసుకుంటే క్యాన్సర్ అవకాశాలు తగ్గిపోతాయన్న భావన కూడా ప్రజల్లో వ్యాప్తిలో ఉంది. ఈ అభిప్రాయంలోని నిజానిజాలపై వైద్యులు సవివరమైన సమాధానం ఇస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని క్యాన్సర్ బలి తీసుకుంటోంది. మారుతున్న జీవనశైలి కారణంగా యువత కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. క్యాన్సర్ చికిత్సలు అనేకం అందుబాటులోకి వచ్చినప్పటికీ దీన్ని ముందుగా గుర్తిస్తే సులువుగా వదిలించుకోవచ్చు. అయితే, క్యాన్సర్ కారకాల్లో మద్యం కూడా ఒకటని శాస్త్రవేత్తలు ఎప్పుడో రుజువు చేశారు. కానీ రెడ్ వైన్ తీసుకుంటే క్యాన్సర్ అవకాశాలు తగ్గిపోతాయన్న భావన కూడా ప్రజల్లో వ్యాప్తిలో ఉంది. ఈ అభిప్రాయంలోని నిజానిజాలపై వైద్యులు సవివరమైన సమాధానం ఇస్తున్నారు (Health).
Health: వేడి నీటి స్నానాలతో ఈ సమస్యలు ఉన్నాయని తెలుసా?
‘‘రెడ్ వైన్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. ఇందులోని రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్‌లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని పరిశోధనల్లో కూడా రుజువైంది. రెస్వెరాట్రాల్.. కణితుల వృద్ధిని నిరోధించడంతో పాటు క్యాన్సర్ వ్యాప్తిని అడ్డుకుని, క్యాన్సర్ కణాలను నిర్మూలించిన విషయం కూడా పరిశోధనల్లో తేలింది’’ అని ప్రముఖ వైద్యుడు ఒకరు తెలిపారు.
అయితే, రెడ్ వైన్‌లోని రెస్వెరాట్రాల్ క్యాన్సర్ నిరోధించే స్థాయిలో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తాగే ఒక గ్లాస్ రెడ్ వైన్‌లో క్యాన్సర్ నిరోధించేతటి శక్తి ఉండదని స్ఫష్టం చేశారు. కాబట్టి, పరిశోధనల్లో కనిపించిన స్థాయిలో రెడ్ వైన్‌తో పలితాలు ఉండవని స్ఫష్టం చేశారు.
కాబట్టి, రెడ్ వైన్ అతిగా తాగితే ప్రయోజనాలు కలగకపోగా ప్రతిగా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువవుతాయని అంటున్నారు. మద్యంలోని క్యాన్సర్ కారక గుణాలే ఇందుకు కారణమని స్పష్టం చేశారు.
Health: రాత్రి లేటుగా నిద్రపోయి మర్నాడు తెల్లవారుజామునే లేస్తున్నారా! అయితే..
ఆల్కహాల్‌తో క్యాన్సర్ ఇలా..
శరీరంలో ఆల్కహాల్.. ఎసటాల్డిహైడ్ అనే విషపూరిత పదార్థంగా మారుతుంది. ఇది కణజాలంలోని డీఎన్ఏకు మార్పులు చేసి సాధారణ కణాలను క్యాన్సర్ కణాలుగా మారుస్తుంది. దీనికి తోడు, మద్యం కారణంగా శరీరం ఆహారంలోని పోషకాలను కూడా పూర్తి స్థాయిలో గ్రహించలేకపోతుంది. ఫలితంగా, రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. క్యాన్సర్ కణాలను గుర్తించి తొలగించడంలో విఫలమవుతుంది. ఈ పరిస్థితులు అంతిమంగా క్యాన్సర్‌కు దారి తీస్తాయి. ఓ మోస్తరుగా మద్యం తాగినా క్యాన్సర్ ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, రెడ్ వైన్‌లోని యాంటీఆక్సిడెంట్ గుణాల కారణంగా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆల్కహాల్ కారణంగా కలిగే దుష్ప్రభావాలే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Immunity Boosters for Winter: చలికాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఫుడ్స్ ఇవే
Beer: బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..
Updated Date - Nov 16 , 2024 | 10:17 PM