Health: మనం సాధారణంగా వాడే ఈ ఔషధాలతో మతిమరుపు వచ్చే ఛాన్స్!
ABN, Publish Date - Dec 03 , 2024 | 09:23 AM
సాధారణంగా ప్రజలు వాడే కొన్ని రకాల మందులతో మతిమరుపు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ బ్రెయిన్ బారియర్ దాటి మెదడులోకి ప్రవేశించే వీటితో రిస్క్ ఉందని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మతిమరుపు, ఇతర మెదడు క్షీణత సమస్యలు రోగులపైనే కాకుండా వారి కుటుంబసభ్యులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మతిమరుపునకు పూర్తిస్థాయి చికిత్సలేవి అందుబాటులో లేకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. అయితే, సాధారణంగా ప్రజలు వాడే కొన్ని రకాల మందులతో మతిమరుపు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ బ్రెయిన్ బారియర్ దాటి మెదడులోకి ప్రవేశించే వీటితో రిస్క్ ఉందని చెబుతున్నారు (Health).
Urinary Incontinence: తరచూ మూత్రం ఆపుకుంటున్నారా? ఇది ఎంత ప్రమాదమో తెలిస్తే..
ఎలర్జీలకు చికిత్సగా వాడే యాంటీహిస్టమీన్స్‌తో మతిమరుపు ప్రమాదం పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో నిద్రమత్తుగా ఉన్న భావన కలుగుతుండటంతో అనేక మంది నిద్రపట్టేందుకు వీటిని వాడుతున్నారట. తరచూ వీటిని వాడితే మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఔషధాలను అతిగా వాడితే తికమక, కంటిచూపు తగ్గినట్టు ఉండటం, మలబద్ధకం, అలసట, తలతిరుగుతున్నట్టు ఉండటం తదితర సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
ఆపరేషన్లు, గాయాలు, క్యాన్సర్ చికిత్స సమయాల్లో నొప్పి తగ్గించేందుకు వాడే ఓపియేట్స్‌తో కూడా మతిమరుపు అవకాశాలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని దీర్ఘకాలికంగా వినియోగిస్తే మతిమరుపు బారిన పడే అవకాశాలు గణీయంగా పెరుగుతాయట. వీటి వాడకంతో మతిమరుపు రిస్క్ 15 శాతం పెరుగుతుందని పలు అధ్యనాల్లో తేలింది.
Thirst: ఎంత నీరు తాగుతున్నా దాహంగా ఉంటోందా? కారణాలు ఇవే!
అరుగుదల సమస్యలు, గుండెలో మంట వంటి వాటికి పరిష్కారంగా వాడే ఒమెప్రజోల్‌తో కూడా మతిమరుపు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ల మెదడులో బీటా ఒమిలాయిడ్ ఎక్కువవుతోందని వివరించారు. వీటి కారణంగా మెదడు సామర్థ్యం తగ్గడం, మతిమరుపు పెరగడం వంటివి జరుగుతాయని అన్నారు.
ఆందోళన, నిద్రలేమి వంటి వ్యాధులకు చికిత్సగా వాడే బెంజోడయాజిపైన్స్‌కు మతిమరుపునకు కొంత మేర సంబంధం ఉందని వైద్యులు చెబుతున్నారు. మెదడులో నేరుగా వెళ్లే ఈ ఔషధాలు అది నెమ్మదించేలా చేసి ఆందోళన తగ్గిస్తాయి. అయితే, దీన్ని సుదీర్ఘకాలం పాటు వాడితే మతిమరుపు అవకాశాలు పెరుగుతాయట.
డిప్రెషన్‌కు చికిత్సగా వాడే యాంటీడిప్రెసెంట్స్‌తో కూడా మతిమరుపు ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అమిట్రిప్టిలీన్ లాంటి ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్‌తో కన్ఫ్యూజన్, కిందపడే అవకాశాలు పెరుగుతాయట.
Updated Date - Dec 03 , 2024 | 09:38 AM