Coriander: వంటల్లో అలంకరణకే కాదండోయ్.. కొత్తిమీరను ఇలా వాడితే ఎన్ని లాభాలంటే,,!
ABN, Publish Date - Jan 11 , 2024 | 08:13 AM
వంటల్లో రుచి, సువాసన కోసం, వంట ముగిసిన తరువాత అలంకరణ కోసం కొత్తిమీరను ప్రతి ఇంట్లో వాడతారు. కానీ ఇలా వాడితే మాత్రం షాకింగ్ ఫలితాలుంటాయి.
వంటల్లో రుచి, సువాసన కోసం, వంట ముగిసిన తరువాత అలంకరణ కోసం కొత్తిమీరను భారత్ లో ప్రతి ఇంట్లో వాడతారు. కొత్తిమీర లేకపోతే ఆహారం రుచి ఏమీ బావుండదు. కానీ కొత్తిమీరను సరైన విధంగా వాడితే బోలెడు రోగాలను కూడా నయం చేసుకోవచ్చట. కొత్తమీర గురించి ఆయుర్వేద వైద్యులు చెబుతున్న విషయాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
కొత్తిమీర ఎందులో వేసినా దాని వాసన చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. మనసుకు విశ్రాంతిని ఇచ్చి మూడ్ ను రిఫ్రెష్ చేసే గుణాలు కొత్తమీరలో బోలెడు ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడం ద్వారా మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. రోజూ కొన్ని కొత్తిమీర ఆకులను నమిలి తినడం వల్ల మానసిక ఆరోగ్యం బావుంటుంది.
కొత్తిమీర ఆకులు చాలా శక్తివంతమైనవి. ఇవి శరీరాన్ని శుద్ది పరచడంలో ఎక్పర్ట్. ప్రతి రోజూ కొత్తిమీరను జ్యూస్ చేసుకుని తాగడం వల్ల శరీరంలో టాక్సిన్లు తొలగిపోతాయి. చర్మ సంబంధ సమస్యలు తొలగిస్తుంది. మచ్చలేని చర్మాన్ని అందిస్తుంది. చర్మాన్ని కాంతి వంతం చేస్తుంది.
ఇది కూడా చదవండి: అల్పాహారంగా మొలకలు తింటే కలిగే షాకింగ్ ఫలితాలివీ..!
బరువు తగ్గాలని ట్రై చేసేవారికి కొత్తిమీర ఆకులు నిజంగా గొప్ప వరం. కొత్తిమీర జ్యూస్ ను ప్రతిరోజూ ఉదయాన్నే తాగుతుంటే ఎంత భారీగా ఉన్న శరీరం అయినా సన్నబడాల్సిందే. కొత్తిమీర ఆకలిని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
పదే పదే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారికి కొత్తిమీర ఆకులు దివ్యౌషదం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ సమస్యలు, జ్వరాలు వంటి జబ్బులు మాటిమాటికి వస్తుంటే కొత్తీమీర ఆకులను జ్యూస్ లేదా పచ్చిగా తింటూంటే అన్నీ మంత్రించినట్టు మాయమవుతాయి.
ఇది కూడా చదవండి: ఏలకుల పాలకు ఇంత శక్తి ఉందా? రాత్రి పడుకునేముందు తాగితే జరిగేదిదీ..!
తిన్న ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతుంటే కొత్తిమీర బాగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులను పచ్చిగా లేదా చట్నీ, జ్యూస్ రూపంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ సెట్ అవుతుంది. వంటల్లో కొత్తిమీరను బాగా వాడితే గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
కొత్తిమీర కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించగలదు. కొత్తిమీర జ్యూస్ ను లేదా పచ్చి ఆకులను ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ ను నియంత్రించడం ద్వారా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: జుట్టు బాగా రాలిపోతోందా? ఈ నూనెలు వాడితే మ్యాజిక్కే!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 11 , 2024 | 10:04 AM