Vegetarian Food: వెజిటేరియన్స్‌కు మాత్రమే వచ్చే ఈ ఇబ్బందుల గురించి తెలుసా?
ABN, Publish Date - Feb 15 , 2024 | 05:33 PM
కేవలం శాకాహారం మాత్రమే తినేవారికీ కొన్ని సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కొందరు శాకాహారాన్ని మాత్రమే తినేందుకు ఇష్టపడతారు. ఆధ్యాత్మికం, మతం, జంతువుల పట్ల సానుభూతి.. ఇలా వివిధ కారణాలతో వెజిటేరియన్ ఫుడ్‌యే బెటరని చెబుతారు. పశుపోషణలో హార్మోన్లు ఉపయోగిస్తారంటూ కొందరు శాకాహారంవైపు మళ్లుతారు. ఇలా శాకాహారంపైనే ఎక్కువగా ఆధారపడటంతో వేగంగా బరువు తగ్గడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా, డయాబెటిస్, క్యాన్సర్, అధిక కొలెస్టెరాల్, బీపీ వంటి అనారోగ్యాల రిస్క్ తగ్గుతుంది. అయితే, శాకాహారంతో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు (Disadvantages of Vegetarian food).
ఇబ్బందులు ఇవే
శరీరానికి కావాల్సిన అన్ని ప్రొటీన్లు శాకాహారంతో దక్కడం కష్ఠసాధ్యమనేది నిపుణులు అభిప్రాయం కాబట్టి, శరీరంలో ప్రొటీన్ లోపం తలెత్తే అవకాశం ఉంది.
విటమిన్ బీ12, ఐరోన్ లోపం తలెత్తే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు.
మనకు కావాల్సిన క్రియాటినైన్‌లో కొంత మొత్తాన్ని శరీరమే తయారు చేసుకున్నప్పటికీ అధిగశాతం ఆహారం ద్వారానే అందుతుంది. శాకాహారుల్లో ఇది తక్కువగా అందే అవకాశం ఉండటంతో ఇలాంటి వాళ్లు క్రియాటినైన్ సప్లిమెంట్స్ తీసుకోవాలని చెబుతున్నారు.
విటమిన్ డీ తగ్గితే ఎముకలు బలహీనంగా మారతాయి. అయితే, ఈ విటమిన్ చేపలు, గుడ్లలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శాకాహారుల్లో ఈ విటమిన్ కూడా లోపించే అవకాశం ఉంది
కార్నోసిన్ అనే యాంటీఆక్సిడెంట్ కండరాల పనితీరుకు అవసరం. ఇది జంతువుల మాంసంలో అధికంగా ఉంటుంది. కాబట్టి, వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్లకు ఇది కావాల్సినంత మొత్తంలో శరీరానికి అందదు.
Updated Date - Feb 15 , 2024 | 05:38 PM