ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Guava: జామ పండుతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు ఉన్నాయ్.. ఈ సమస్యలున్న వారు తినకూడదు..

ABN, Publish Date - Nov 06 , 2024 | 05:40 PM

Summary: పేదవాడి యాపిల్ గా పిలవబడే జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ అందరికీ ఇవి మేలు చేయవు. కొందరికి ఇవి చాలా హాని కలిగిస్తాయి.

Guava: జామ పండుతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు ఉన్నాయ్.. ఈ సమస్యలున్న వారు తినకూడదు..

జామ పండును పేదవాడి యాపిల్ గా పరిగణిస్తారు. యాపిల్ పండులో ఉండే చాలా పోషకాలు జామ పండులో కూడా ఉంటాయి. ఎక్కువ డబ్బు పెట్టి యాపిల్ పళ్లు కొని తినలేని పేదవారికి అంతే పోషకాలు అందించే పండు జామ పండే. అందుకే దీనికి పేదవాడి యాపిల్ అనే పేరు వచ్చింది. జామ పండులో ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఈ కారణంగా జామ పండును తింటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. రోజు ఒక జామపండు తింటే బోలెడు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అయితే జామ పండ్లు అందరికీ మేలు చేయవు.. కొందరికి నష్టాలు కూడా కలిగిస్తాయి. జామపండ్లను ఎవరు తినకూడదు? తింటే ఏం జరుగుతుంది? తెలుసుకుంటే..

గర్బిణీ స్త్రీలు, పాలిచ్చే మహిళలు జామ పండ్లను తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదని అంటున్నారు. జామ పండ్లలో కొన్ని రసాయనాలు ఉంటాయి. ఇవి కొన్ని సార్లు చర్మం మీద చికాకు కలిగిస్తాయి. ఎగ్జిమా వంటి చర్మ సమస్యలు ఉన్నవారిలో ఇది ఎక్కువగా జరుగుతుంది.


రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉన్నవారు జామ పండ్లు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. జామ పండ్లు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తగ్గిపోతాయి. ఇది ప్రమాదానికి దారితీస్తుంది. ఏదైనా శస్త్ర చికిత్స చేయించుకున్నవారు జామ పండ్లను తినడం తగ్గించడం మంచిది. ఇది ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తుంది.

జామ పండ్లు తినేముందు బాగా కడగాలి. వీటిని ఎక్కువ కాలం నిల్వచేయడానికి రసాయనాలు వాడతారు. ఇవి కూడా ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. కుదిరితే సహజంగా పండిన జామపండ్లను కొనుగోలు చేయడం వాటినే తినడం అన్ని విధాల శ్రేయస్కరం.

Updated Date - Nov 06 , 2024 | 05:40 PM