ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా వాడితే జరిగేది ఇదే..

ABN, Publish Date - Oct 17 , 2024 | 03:25 PM

వెల్లుల్లి ఆహారానికి రుచిని, వాసనను ఇస్తుంది. కానీ దీన్ని ఎక్కువగా తింటే ఏం జరుగుతుందంటే..

Garlic

ఉల్లి, వెల్లుల్లి లేకుండా చాలామంది వంటలు చేయడం లేదు . ముఖ్యంగా రోజురోజుకూ పెరుగుతున్న ఆరోగ్య సమస్యల కారణంగా వెల్లుల్లి వాడకాన్ని పెంచుతున్నారు. వెల్లుల్లి గొప్ప ఔషదంగా పనిచేస్తుందని, వెల్లుల్లి వాడటం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుందని అంటారు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. వెల్లుల్లి లో ఉండే అల్లిసిన్ అనే ఎంజైమ్ చాలా శక్తివంతమైనది. ఇది చాలా రోగాలను నయం చేయడంలో సహాయపడుతుంది. అందుకే వెల్లుల్లిని ప్రతి వంటలో భాగం చేస్తున్నారు. కొందరికి వెల్లుల్లి లేని వంట తినాలని కూడా అనిపించదు. వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే అయినా దీన్ని ఎక్కువగా తినడం వల్ల నష్టాలు తప్పవని ఆహార నిపుణులు అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

Heart Blockage: మీ ధమనులు శుభ్రంగా ఉన్నాయా లేదా ఇలా నిర్ధారించుకోండి..


జీర్ణక్రియ..

వెలుల్లి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అయితే వెల్లుల్లిని ఎక్కువగా తింటే జీర్ణ సంబంధ సమస్యలు కలుగుతాయి. వెల్లుల్లిలో ప్రక్టాన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీన్ని పెద్ద పరిమాణంలో తీసుకుంటే జీర్ణక్రియకు, ప్రేగులకు ఇబ్బంది కలుగుతుంది. జీర్ణవ్యవస్థకు చికాకు కలుగుతుంది. జీర్ణాశయ పొరలు దెబ్బతింటాయి. గుండె మంట, యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం, వికారం, అపానవాయువు, పెస్టిక్ అల్సర్ సమస్యల ప్రమాదం పెంచుతుంది.

నోటి ఆరోగ్యం..

వెల్లుల్లి జోడించి వండిన ఆహారాన్ని తీసుకుంటే నోరు దుర్వాసన వస్తుంది. పళ్లు తోముకున్నా, మౌత్ ఫ్రెషనర్ వాడినా సరే.. ఈ దుర్వాసన అంత త్వరగా పోదు. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు జీర్ణం అయిన తరువాత రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. ఇవి ఊపిరితిత్తులలోకి ప్రయాణించి గొంతు కు చేరి అవి నోటి నుండి శ్వాస ద్వారా బయటకు వస్తాయి. ఫలితంగా నోటి దుర్వాసన వస్తుంది. వెల్లుల్లిలో ఉండే డయాలిల్ డైసల్పైడ్, అలల్లైల్ మిథైల్ సల్పైడ్, అల్లైల్ మెర్కాప్టాన్, అల్లైల్ మిథైల్ డైసల్పైడ్ ఈ వాసనకు కారణం అవుతాయి.

Baby Care: చిన్నపిల్లలకు ఆయిల్ మసాజ్ చేస్తున్నారా ఈ నిజాలు తప్పక తెలుసుకోండి..


అలెర్జీ..

కొందరికి వెల్లుల్లి తింటే అలెర్జీ వస్తుంది. శరీరం మీద దద్దుర్లు, దురద, అనాఫిలాక్సిస్ వంటివి ఈ అలెర్జీలో భాగంగా ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.

రక్తస్రావం..

వెల్లుల్లి అధికంగా తింటే ఎదురయ్యే ప్రమాదకరమైన సమస్యలలో రక్తస్రావం కూడా ఒకటి. రక్తం పలుచబడటానికి, శస్ర్తచికిత్సలు చేయించుకున్న వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వెల్లుల్లి రక్తాన్ని పలుచబడేటట్లు చేస్తుంది. యాంటిథ్రాంబోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. ఏవైనా గాయాలు అయినప్పుడు, శస్ర్తచికిత్సలు చేయించుకున్నప్పుడు రక్తం స్రావం అయ్యే ప్రమాదం ఎక్కువ.

Dry Skin: మీది పొడి చర్మమా? ఆయుర్వేదం చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే చలికాలంలో సేఫ్..!


రక్తపోటు..

వెల్లుల్లిలో రక్తనాళాలను సడలించే సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ కారణంగా వెల్లుల్లి తింటే రక్తపోటు తగ్గుతుంది. వెల్లుల్లి రక్తపోటు సమస్యకు సంబంధించి మందులతో చర్య జరిపితే రక్తపోటు చాలా దారుణంగా పడిపోతుంది. మైకం, తలతిరగటం, మూర్ఛ, తలనొప్పి, దృష్టి తగ్గడం వంటివి ఏర్పడతాయి.

చర్మం..

సున్నితమైన చర్మం ఉన్నవారికి వెల్లుల్లి చేటు చేస్తుంది. వెల్లుల్లిని నేరుగా చర్మం పై ఉపయోగించకూడదు. ఇది అప్పటికే ఉన్న గాయాలు, పొక్కులు, దెబ్బలు మరింత ఎక్కువ కావడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా వెల్లుల్లిని పచ్చిగా తీసుకుంటే ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిని వీలైనంత వరకు వంటల్లో వాడటమే బెస్ట్.

ఇవి కూడా చదవండి..

ఈ పండ్లు తినండి రక్తంలో చక్కెర స్థాయిలకు చెక్ పెట్టచ్చు..

ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 17 , 2024 | 03:25 PM