ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lancet: భారతీయులపై సంచలన అధ్యయనం.. దేశంలో సగానికిపైగా ప్రజల పరిస్థితి ఇదే!

ABN, Publish Date - Jul 09 , 2024 | 06:21 PM

భారత్‌లో సగానికి పైబడి ప్రజలు నడక, వాకింగ్, ఇతర కసరత్తులు లాంటి ఫిజికల్ యాక్టివీలో పాల్గొనకుండా ఉన్నారని ప్రముఖ జర్నల్‌లో లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. కసరత్తులకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాలకంటే వెనకబడి ఉన్నారని కుండబద్దలు కొట్టింది.

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో సగానికి పైబడి ప్రజలు నడక, వాకింగ్, ఇతర కసరత్తులు లాంటి ఫిజికల్ యాక్టివీలో పాల్గొనకుండా ఉన్నారని ప్రముఖ జర్నల్‌లో లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. కసరత్తులకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాలకంటే వెనకబడి ఉన్నారని కుండబద్దలు కొట్టింది. ఈ ఒరవడి దేశజనాభాపై పెను ప్రభావం చూపుతుందని, దీర్ఘకాలిక వ్యాధుల భారం పెరుగుతుందని హెచ్చరించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల ప్రకారం, వయసులో ఉన్నవాళ్లు వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాల పాటు ఎయిరోబిక్ కసరత్తులు చేయాలి. లేదా వారానికి గరిష్ఠంగా 150 నిమిషాల పాటు కఠినమైన ఎక్సర్‌సైజులు చేయాలి (Health).

Viral: పిల్లల్లో బీపీ, కిడ్నీ సమస్యలు! తీసుకోవాల్సిన జాగ్రత్తలు!


ఎక్సర్‌సైజులు లేదా ఇతర ఫిజికల్ యాక్టివిటీల్లో పాల్గొనకపోవడమనేది ప్రపంచాన్ని ముంచేస్తున్న ఓ నిశ్శబ్ద ప్రమాదమని డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ డా. దుడిజర్ క్రెచ్ పేర్కొన్నారు. ఇలాంటి వారికి డయాబెటిస్, బీపీ, హృద్రోగాలు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడతారని అన్నారు. ఇక తాజాగా గణాంకాల ప్రకారం, భారత్‌లో 1.01 కోట్ల మంది డయాబెటిస్ రోగులు ఉన్నారు. ద్రుఢమైన, ఆరోగ్యవంతమైన దేశం కోసం మనందరం కృష్టిచేయాలని వైద్యులు చెబుతున్నారు. మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే వైద్యవ్యవస్థపై భారం కూడా తగ్గుతుందని చెబుతున్నారు (Heres what happens to the body if you dont exercise 150 minutes per week).

నిరంతర కసరత్తుల ద్వారా ఎముకలు, కండరాలు బలపడి మహిళల్లో ఎముకలు గుల్లబారే ప్రమాదం చాలా వరకూ తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఐదేళ్ల వయసు పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఏయే కసరత్తులు చేయాలో చెబుతూ డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడో మార్గదర్శకాలు విడుదల చేసిందని అంటున్నారు. ముఖ్యంగా శరీరంలోని అన్ని కండరాలను బలపరిచే ఎక్సర్‌సైజులను వారానికి రెండు మూడు రోజులు చేస్తే అనేక అదనపు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయట. కసరత్తుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్ల మంది కాలుకదపకుండా, కసరత్తుల జోలికెళ్లకుండా గడిపేస్తున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Health and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 06:30 PM

Advertising
Advertising
<