ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Joint Pains: వానాకాలంలో పెరిగే కీళ్ల నొప్పులు.. కారణం ఇదే!

ABN, Publish Date - Aug 11 , 2024 | 10:36 PM

కీళ్ల నొప్పులు ఉన్న వారికి వానాకాలంలో ఇబ్బందులు అధికమవుతాయని నిపుణులు చెబుతున్నారు. గాల్లో పీడనం, తేమ శాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు కీళ్లపై ప్రభావం చూపిస్తాయని, చివరకు కీళ్ల నొప్పులు పెరుగుతాయని అంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఎండకాలంలో వేడి తట్టుకోలేక ఇబ్బంది పడ్డ వారికి వానాకాలం గొప్ప ఊరటనిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, కీళ్ల నొప్పులు ఉన్న వారికి మాత్రం ఈ కాలంలో ఇబ్బందులు అధికమవుతాయని నిపుణులు చెబుతున్నారు. గాల్లో పీడనం, తేమ శాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు కీళ్లపై ప్రభావం చూపిస్తాయని, చివరకు కీళ్ల నొప్పులు (Joint Pains) పెరుగుతాయని అంటున్నారు. ఆర్థరైటిస్ వంటి వ్యాధులతో బాధపడే వారికి ఈ సమస్య అధికమని చెబుతున్నారు (How to get rid of joint pains in monsoon season).

Mental Health: జీవితంలో ఈ మార్పులను ఆహ్వానిస్తే.. డిప్రెషన్ పరార్!


వానాకాలంలో కీళ్ల నొప్పులు పెరగడానికి కారణాలు..

  • కీళ్ల మధ్య సినోవియల్ ఫ్లూయిడ్ అనే ద్రవం ఉంటుందని చెబుతున్నారు. ఇది కీళ్ల మధ్య రాపిడిని తగ్గిస్తుందట. అయితే, వానాకాలంలో గాల్లో పీడనం మార్పులకు లోనైనప్పుడు ఈ ద్రవం కాస్తంత చిక్క పడి ఎముకల మధ్య కదలికలకు ఆటంకంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా, కీళ్ల నొప్పులు అధికమవుతాయి.

  • వాతావరణంలో పీడనం తగ్గినప్పుడు కీళ్ల వద్ద ఉన్న కణజాలం కొద్దిగా వాస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది నాడీకళాలపై ఒత్తిడి పెంచి నొప్పులకు దారి తీస్తుంది.

  • ఈ కాలంలో ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా కీళ్లు, కండరాలు పట్టేసినట్టుగా అనిపించి నొప్పులు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

  • చలి, తేమ వాతావరణం కారణంగా కీళ్లల్లో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి నొప్పులు అధికమవుతాయి.

  • వానల కారణంగా కసరత్తులకు ఆటంకాలు ఏర్పడి కండరాలు, కీళ్లు పట్టినట్టు అవుతాయని వైద్యులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులు ఉన్న వారిలో సమస్య కాస్తంత తీవ్ర మవుతుందని హెచ్చరిస్తున్నారు.


కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం ఇలా..

ఈ కాలంలో కీళ్ల నొప్పులు దరి చేరకుండా ఉండేందుకు కస్తరత్తులు క్రమం తప్పకుండా చేయడం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం, ఒంటికి వెచ్చదనం తగిలేలా దుస్తులు ధరించడం, తేమ వాతావరణానికి దూరంగా ఉండటం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 11 , 2024 | 10:36 PM

Advertising
Advertising
<