Immunity Boosters for Winter: చలికాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఫుడ్స్ ఇవే
ABN, Publish Date - Nov 08 , 2024 | 09:35 PM
చలికాలంలో అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ. ఈ కాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఫుడ్స్ క్రమం తప్పకుండా తినాలి. ఇందుకు అనువైన ఫుడ్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిని తింటే ఈకాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చలికాలంలో అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఈ కాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఫుడ్స్ క్రమం తప్పకుండా తినాలి. ఇందుకు అనువైన ఫుడ్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిని తింటే ఈకాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చని (Health) నిపుణులు చెబుతున్నారు. మరీ ఈ కాలానికి అనువైన ఫుడ్స్ ఏవంటే..
నిమ్మ జాతి పండ్లల్లో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తెల్లరక్తకణాల సంఖ్యను పెంచి ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా చూస్తుంది. ఇక నిమ్మరసంలో చెంచాడు తేనె కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తితో పాటు జీవక్రియల వేగం పెరిగి ఆరోగ్యం ఇనుమడిస్తుంది.
Beer: బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..
భారతీయుల అనాదిగా వాడుతున్న పసుపు ఔషధ గుణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇందులోని కుకుర్మిన్ అనే రసాయనానికి యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అయితే, పసుపు పొడికంటే పసుపు కొమ్ములు మరింత ప్రభావశీలమని నిపుణులు చెబుతున్నారు.
నారింజలో కంటే ఉసిరిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని జ్యూస్ లాగా తాగినా క్యాండీలాగా తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ఉదయాన్నే ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి ఇనుమడిస్తుంది.
బ్రోకలీలో విటమిన్ సీతో పాటు విటమిన్ ఏ, ఈలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువే. ఫలితంగా ఇది రోగ నిరోధక శక్తితో పాటు జీర్ణవ్యవస్థకూ మేలు చేస్తుంది.
మునగాకులో కూడా విటమిన్ ఏ, సీ, ఈలు ఉంటాయి. ఒక్క స్పూన్ మునగాకు పొడి 10 గ్లాసుల నారింజ జ్యూస్‌తో సమానమైన విటమిన్ సీ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మునగ కూడా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
Viral: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టే
బొప్పాయి పండులో ఉండే పాపెయిన్ అనే ఎంజైమ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో పాటు మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ ఉంటాయి. ఫలితంగా బొప్పాయితో రోగనిరోధక శక్తి బాగా శక్తిమంతం అవుతుంది.
ఇక అల్లం, వెల్లుల్లి కూడా రోగనిరోధక శక్తిని ఇనుమడింప చేస్తాయి. వీటిల్లో యాంటీమైక్రోబియన్ గుణాలు కూడా ఉన్నాయి. జలుబు దగ్గుతో బాధపడే వారు అల్లం టీ, లేదా పాలు తాగడం అందరికీ తెలిసిందే.
కుంకుమ పువ్వుకు యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది కూడా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా, హార్మోన్ల సమతౌల్యతను కూడా కాపాడుతుంది.
ఇక బీట్‌రూట్‌లోని యాంటీఆక్సిడెంట్స్, నైట్రేట్లు, రక్తప్రసరణను మెరుగు పరిచి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. కాబట్టి, రోగనిరోధక శక్తి బలోపేతం అయ్యేందుకు ఇది కూడా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Health: బరువు తగ్గేందుకు నడకకు మించిన ఎక్సర్‌సైజు లేదు! ఎందుకంటే..
Updated Date - Nov 08 , 2024 | 09:36 PM