Mental Health: జీవితంలో ఈ మార్పులను ఆహ్వానిస్తే.. డిప్రెషన్ పరార్!
ABN, Publish Date - Aug 10 , 2024 | 09:57 PM
డిప్రెషన్ నుంచి బయటపడాలంటే మందులు, కౌన్సెలింగ్‌తో పాటు జీవన శైలిలో మార్పులు కూడా కీలకమని వైద్యులు చెబుతున్నారు. మంచి ఆహారం, మెడిటేషన్, తగినంత నిద్ర వంటివాటితో డిప్రెషన్‌న సులువుగా జయించవచ్చని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక కాలంలో డిప్రెషన్ బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్కసారి ఇది వేళ్లూనుకుందంటే జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు మందులు, కౌన్సెలింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ బాధితులు తమ జీవితంలో కొన్ని మార్పులు తీసుకొస్తే మరింత మెరుగైన ఫలితాలు (Health) ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే...
Health: ఇది తెలిస్తే.. చన్నీటి స్నానం వెంటనే మానేస్తారు!
అనేక మానసిక సమస్యలకు పరిష్కారం ఆరోగ్యకరమైన ఆహారంలో ఉందని నిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్‌ను తగ్గిస్తే మూడ్ త్వరితంగా మెరుగవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారంతో డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గిపోతాయట.
వారంలో కనీసం మూడు నుంచి ఐదు రోజుల పాటు క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తే డిప్రెషన్ మాయమైపోతుందట.
మెడిటేషన్, ఊపిరిపై దృష్టిపెట్టడం, లేదా నచ్చిన మంత్రాన్ని జంపించడం కూడా డిప్రెషన్‌ను తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
నిద్రలేమితో మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందట. భావోద్వేగాలపై నియంత్రణ తగ్గి మనసులో అల్లకల్లోలం చెలరేగుతుందట. కాబట్టి, నిద్ర విషయంలో ఓ షెడ్యూల్ పాటిస్తే ఈ సమస్యలు ఇట్టే దూరమైపోతాయని వైద్యులు చెబుతున్నారు.
డిప్రెషన్‌ను దూరం చేయడంలో సామాజిక బంధాలది కీలక పాత్ర. బంధువులు, స్నేహితులు, మనసుకు నచ్చిన వారు లేదా జీవిత భాగస్వామితో గాఢమైన బంధం పెంపొందించుకుంటే కష్టసమయాల్లో వారి సాంగత్యం మనసుకు స్వాంతన చేకూరుతుందని కూడా అధ్యయనాలు రుజువు చేశాయి.
ఎంత పరిమితంగా మద్యం తాగినా మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఒ పెగ్గే కదా అంటూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించేవారు కష్టాల్లో ఉన్నప్పుడు త్వరగా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Aug 10 , 2024 | 09:57 PM