Indoor Pollution: ఎక్కువ సేపు వంటగదిలో గడుపుతున్నారా? ఎంతటి రిస్కొ తెలిస్తే..
ABN, Publish Date - Dec 17 , 2024 | 06:43 PM
ఎక్కువ సేపు వంట గదిలో గడిపేవారు తమకు తెలీకుండానే ప్రమాదం బారిన పడుతున్నారని శాస్త్రజ్ఞులు గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: వంట చేయడం కూడా ఒక కళే. అందుకే అనేక మంది వంట చేయడానికి ఇష్టపడతారు. ఇక పిల్లలకు వంట నేర్పిస్తే పోషకాహారం, శ్రమ విలువ పనిని పంచుకోవడం, శుభ్రత, టైమ్ మేనేజ్‌మెంట్ వంటి మంచి అలవాట్లన్నీ అలవడుతాయి. కొందరికి ఇతరులకు రుచికరమైన వంట వండిపెట్టడం కూడా ఇష్టమే. అయితే, ఇలా రకరకాల కారణాలతో నిత్యం వంటింట్లో గడిపేవారికి కొన్ని రకాల రిస్క్‌లు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు (Health).
Intermittent Fasting: ఈ తరహా ఉపవాసంతో జుట్టుకు చేటు!
వంటచేసేటప్పుడు వెలువడే ఉద్గారాలపై యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం, ఉడుకుతున్న ఆహారం నుంచి వెలువడే సూక్ష్మ బూడిదె కణాలు ఇంట్లోని వాయుకాలుష్యానికి 10 శాతం వరకూ కారణమవుతాయట. ఇవి చాలా రోజుల పాటు గాల్లోనే ఉండటంతో ఇంట్లోనూ వాయుకాలుష్యానికి కారణమవుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సేపు వంటింట్లో గడిపేవారు కాలుష్య ప్రభావానికి గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. ‘‘సూక్ష్మ ధూళికణాలతో ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువై అకాల మరణ ప్రమాదం పెరుగుతుంది. ఇంట్లో ఎక్కువ సమయం గడిపేవారు ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. వంటతో పాటు ఇతర చర్యలతో ఇంట్లోకి చేరే సూక్ష్మ ధూళికణాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి’’ అని పేర్కొన్నారు.
Health: ఆరోగ్యవంతుల్లోనూ కార్డియాక్ అరెస్టు! కారణాలు ఇవే..
వంట కారణంగా ధూళి కణాలతో పాటు, వోలటైల్ ఆర్గానిక్ రసాయనాలు వెలువడతాయి. ధూళికణాలతో ఊపిరితిత్తులపై ప్రభావం పడితే ఆర్గానిక్ రసాయన వాయువుల కారణంగా లివర్, కిడ్నీ, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుందట. ముఖ్యంగా పెనంపై నూనేలో వేయించే విధానం సూక్ష్మ ధూళి కణాలను ఎక్కువగా వెదజల్లుతుందట. క్యూబిక్ మీటరుకు 93 మైక్రోగ్రాముల సూక్ష్మ ధూళి జనిస్తుందట.
Cigarettes - Smoking: టీ, సిగరెట్ అలవాటుందా? ఎలాంటి ఇబ్బందులొస్తాయో తెలిస్తే..
ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు ఆహారాన్ని నీళ్లల్లో లేదా ఆవిరిపై ఉడకబెట్టడం అత్యంత భద్రమైన వంట విధానమని పరిశోధకులు గుర్తించారు. దీంతో, పాటు ఎయిర్ ఫ్రయ్యర్ వినియోగించినా వంట తాలూకు చెడు ప్రభావాలు తగ్గుతాయని చెప్పారు. ఎయిర్ ఫ్రయ్యర్‌లో నూనె కొద్దిగా వినియోగించినప్పటికీ ధూళికణాలన్నీ ఫ్రయ్యర్ లోపలి భాగానికే పరిమితమై ఉండటంతో వాయుకాలుష్యం పెరగదని చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వంటలో నూనె ఎక్కువగా వాడితే పదార్థాలకు సమానంగా వేడి అంది ధూళికణాలు వెలువడటం భారీగా తగ్గుతున్నట్టు కూడా గుర్తించారు. ఇక వంటగదిలోకి పుష్కలంగా గాలివచ్చేలా వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాలని కూడా శాస్త్రజ్ఞులు చెప్పారు. హైస్మోక్ పాయింట్ ఉన్న నూనెలు వినియోగించి, తక్కువ మంటపై వంట వండితే వాయుకాలుష్యం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.
Makeup: ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉండొచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే తిప్పలే!
Updated Date - Dec 17 , 2024 | 06:55 PM