Masala Tea: మసాలా టీ ఆరోగ్యానికి మంచిదేనా? చాలామందికి తెలియని నిజాలివీ..!
ABN, Publish Date - Jan 26 , 2024 | 04:46 PM
. టీ లో ఉన్న మ్యాజిక్కో ఏంటో కానీ ప్రపంచంలో రెండవ బెస్ట్ పానీయంగా మసాలా టీ ఎంపికైంది. కానీ మసాలా టీ ఆరోగ్యానికి మంచిదా కాదా చూస్తే..
భారతదేశంలో టీ లవర్స్ ఎక్కువ. భారతదేశంలో బోలెడు రకాల టీలు ఉన్నాయి. వాటిలో మసాలా చాయ్ చాలా ప్రత్యేకమైంది. లవంగాలు, నల్ల మిరియాలు, అల్లం, ఏలకులు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలను జోడించి తయారుచేసే మసాలా టీ ను కేవలం పానీయంలా కాకుండా ఒక ఎమోషన్ గా చూడటం భారతదేశలోనే కనిపిస్తుంది. వేడి వేడిగా పొగలు కక్కే టీని వేసవికాలంలో అయినా నిరభ్యరంతంగా ఆస్వాదించడం ఇక్కడ కనిపిస్తుంది. టీ లో ఉన్న మ్యాజిక్కో ఏంటో కానీ ప్రపంచంలో రెండవ బెస్ట్ పానీయంగా మసాలా టీ ఎంపికైంది. అసలు మసాలా టీ ఆరోగ్యానికి మంచిదేనా? దీన్ని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..
మసాలా టీ ఆరోగ్యానికి మంచిదేనా..
మసాలా టీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కె ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉపయోగించే అల్లం, ఏలకులు, లవంగాలతో సహా మసాలా చాయ్‌లోని సుగంధ ద్రవ్యాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి వైరస్ లు, ఇన్‌ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: బెల్లం టీ గురించి మీకు తెలియని నిజాలివీ..!
శక్తిని అందిస్తుంది
మసాలా టీలో కెఫీన్ ఉంటుంది. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. మెదడు, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
శరీర కణాలను రక్షిస్తుంది..
ఏలకులను జోడించి తయారుచేసిన బ్లాక్ టీ శక్తివంతమైన పానీయం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను రక్షించడంలో సహాయపడుతాయి.
నొప్పి తగ్గిస్తుంది..
లవంగాలలో యూజీనాల్ ఉంటుంది. ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడే సహజమైన మత్తుమందు. టీలోని అల్లం కూడా నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. లవంగాలు, అల్లం నొప్పిని తగ్గించే యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మసాలా టీలో ఉపయోగించే అల్లం ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది అవయవాలు సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది .
ఇది కూడా చదవండి: Hair fall: జాగ్రత్త ఈ 8 ఆహారపు అలవాట్లు జుట్టు రాలే సమస్యను పెంచుతాయ్!
రోగనిరోధక శక్తి..
దాల్చినచెక్క, అల్లం, యాలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలు రోగనిరోధక శక్తిని పెంపొందించి వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. వీటిలో విటమిన్ సి కూడా ఉంటుంది.
బ్యాక్టీరియాతో పోరాడుతుంది
మసాలా టీని తయారు చేయడానికి ఉపయోగించే మసాలా దినుసులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వ్యాధికారక క్రిములతో పోరాడటానికి, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలోనూ సహాయపడతాయి.
బరువు తగ్గడానికి..
మసాలా టీ జీవక్రియను పెంచుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కతో తయారుచేసిన బ్లాక్ టీ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది శరీరం కేలరీలను వేగంగా శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: అల్పాహారంలో ఇవి తీసుకుంటే చాలు.. రోజంతా రేసుగుర్రం లెక్క చురుగ్గా ఉంటారు!
దుష్ప్రభావాలు..
మసాలా టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. కెఫీన్ ఉన్న కారణంగా దీన్ని ఎక్కువ తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది.
మసాలా టీ లో టానిన్లు ఉంటాయి. ఇవి కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలకు కారణం అవుతుంది.
యాంగ్జిటీ, డిప్రెషన్ తో ఇబ్బంది పడుతున్నవారు దీన్ని తీసుకోకపోవడం ఉత్తమం.
హార్మోన్ల అసమతుల్యత ఉన్న మహిళలు, గర్భవతులు ఈ టీ ఎక్కువ తాగకూడదు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 26 , 2024 | 04:46 PM