Milk: పాలు తాగే అలవాటుందా? ఇలా ట్రై చేసి చూడండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!
ABN, Publish Date - Jan 03 , 2024 | 04:18 PM
సాధారణంగా పాలను వేడి చేసి కాసింత తీపి కలుపుకుని తాగడం, లేదా బూస్ట్, బోర్నవిటా, హార్లిక్స్ వంటివి కలిపి తాగడం చేస్తుంటారు. కానీ ఇలా ట్రై చేసి చూడండి.
పాలు పోషకాహారంలో భాగం. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు అందరికీ రోజూ పాలు తాగడం అలవాటుగా ఉంటుంది. కాఫీ, టీ, పెరుగు, పన్నీర్, వెన్న, నెయ్యి అన్నింటికి పాలే ఆధారం. కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు సమృద్దిగా ఉండటం వల్ల పాలు శక్తివంతమైన డ్రింక్ గా పరిగణింపబడతాయి. సాధారణంగా పాలను వేడి చేసి కాసింత తీపి కలుపుకుని తాగడం, లేదా బూస్ట్, బోర్నవిటా, హార్లిక్స్ వంటివి కలిపి తాగడం చేస్తుంటారు. కానీ పాలను ఈ కింద చెప్పుకున్నట్టు తీసుకుంటే మరెన్నో రెట్ల ఫలితాలు సొంతమవుతాయి.
పసుపు పాలు..(Turmeric milk)
పసుపు పాలను భారతీయులు గోల్డెన్ మిల్క్ అని అంటారు. పాలలో పసుపు కలిపి బాగా మరిగించి ఆ తరువాత తీసుకోవడం వల్ల సాధారణ పాలకంటే మరెన్నో రెట్ల ఫలితాలు పొందవచ్చు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా కలిగి ఉంటుంది. అంటువ్యాధులు నివారించడంలో సహాయపడుతుంది. నిరాశను తగ్గించడానికి, మంచి నిద్ర పొందడానికి కూడా ఇది పనిచేస్తుంది. రాత్రి పడుకునేముందు పసుపుపాలు తాగితే నిద్ర బాగావస్తుంది.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే పచ్చి కరివేపాకులు నమిలి తింటే.. ఏం జరుగుతుందంటే..!
అంజీర్ మిల్క్..(Anjeer milk)
చలికాలంలో అంజీర్ పండ్లను తిన్నా, అంజీర్ పండ్లను పాలతో మిల్క్ షేక్ గా చేసుకుని తాగినా శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఎ, విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.
బాదం పాలు..(Almond milk)
బాదంను నానబెట్టి వాటిని మిక్సీ వేసి పాలు తీసి తాగడం కొందరికి అలవాటు. అలా కాకుండా బాదం పొడిని సాధారణ పాలలో వేసి మరిగించి తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇందులోని విటమిన్-ఇ కారణంగా చర్మానికి కూడా మంచిది.
ఇది కూడా చదవండి: పరీక్షల కాలమిది.. పిల్లలలో ఒత్తిడి ఉండకూదంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!
(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న విషయాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 03 , 2024 | 04:18 PM