ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pressure Cooker: పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్‌లో వండకండి!

ABN, Publish Date - Feb 02 , 2024 | 11:40 AM

మహిళలు అన్ని రకాల వంటలు వండటానికి ప్రెషర్ కుక్కర్ వైపు చూస్తుంటారు. కానీ కుక్కర్లో వండకూడని ఆహారాలు ఇవీ..

ప్రెషర్ కుక్కర్ ప్రతి ఇంట్లో తప్పక ఉండే వంటింటి వస్తువు. బహుశా దీన్ని వాడినంత దారుణంగా మరే వస్తువునూ వాడరేమో అనిపిస్తుంది. ఆహారాన్ని ఉడికించాలన్నా, వేయించాలన్నా, బేకింగ్ చేయాలన్నా మొదటగా ప్రెషర్ కుక్కర్ వైపు చూస్తారు అందరూ. అయితే ప్రెషర్ కుక్కర్లో కొన్ని ఆహారాలు చేయడం వల్ల ఆహారం రుచి పాడవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అస్సలు మంచిది కాదని అంటున్నారు. ఇంతకీ ప్రెషర్ కుక్కర్లో అస్సలు వండకూడని ఆహారాలేంటో ఓ లుక్కేస్తే..

ఆకుకూరలు..

చాలామంది మహిళలు పప్పు చేయడానికి సులువుగా ఉంటుందని కుక్కర్లో ఆకుకూరలు, కూరగాయలు అన్నీ కలిపి పెడుతుంటారు. కానీ ఆకుకూరలు ప్రెషర్ కుక్కర్లో ఉడికించడం వల్ల చాలా మెత్తగా అయిపోవడమే కాకుండా వాటిలో పోషకాలు కూడా పాడైపోతాయి.

ఇది కూడా చదవండి: వావ్.. ఈ పక్షుల మల్టీ ట్యాలెంట్ గురించి తెలిస్తే షాకవుతారు..!


వడలు.. వేపుళ్లు..

వడలు, వేపుళ్ళు కరకరలాడుతూ ఉంటేనే రుచి. అవి నూనెలో బాగా వేగడం వల్ల మందంపాటి దోరగా కాలిన పొర వాటికి రుచిని ఇస్తుంది. ఇక వేపుళ్లు కూడా బాగా వేగాలంటే ప్రెషర్ కుక్కర్లు అస్సలు సెట్ కావు. ప్రెషర్ కుక్కర్లు మూత లేకుండా వడలు, వేపుళ్లు వంటివి చేస్తే ఆశించినంత రుచిగా రావు.

సముద్రపు ఆహారాలు..

ప్రెషర్ కుక్కర్లో సముద్రపు ఆహారాలు వండటం మంచిది కాదు. చేపలు, రొయ్యలు, షెల్పిష్ లను కుక్కర్లో వండితే చాలా మెత్తగా అయిపోయి ఆహారం రుచి మొత్తాన్ని పాడుచేస్తుంది.

పాస్తా..

పాస్తాను చాలామంది ఇష్టంగా తింటారు. దీన్ని నిర్ణీత సమయం కంటే ఎక్కువ ఉడికించడం వల్ల దాని స్వరూపాన్నే కోల్పోతుంది. కుక్కర్ వేడి ఎక్కడం వరకు నెమ్మదిగా ఉన్నా ఒక్కసారి బాగా వేడెక్కిందంటే అందులో ఆహారాలను చాలా తొందరగా మెత్తబడేలా చేస్తుంది.

ఇది కూడా చదవండి: Citrus Fruits: భోజనం తరువాత నిమ్మజాతి పండ్లు తినడం ఆరోగ్యమేనా? వైద్యులు బయటపెట్టిన నిజాలివీ..!


పాల ఉత్పత్తులు..

పాలు, పాల ఉత్పత్తులను కుక్కర్లో వండకపోవడం చాలా మంచిది. అధిక ఉష్ణోగ్రతలో ఈ ఆహారాలు వండితే వాటి రుచి, వంట స్వరూపం నాశనం అవుతుంది. పనీర్, క్రీమ్, ఛీజ్ తో కూడిన ఆహారాలు కుక్కర్లో చేయకపోవడం మంచిది.

సూపులు..

సూప్ వండే చాలామంది ప్రెజర్ కుక్కర్ వినియోగిస్తుంటారు. కానీ సూపులను ప్రెషర్ కుక్కర్లో చేయడం వల్ల అధిక ఉష్ణోగ్రత కారణంగా వాటి రుచి, పోషకాలు డామినేషన్ అవుతాయి. పాల క్రీమ్ తో కూడిన సూపులను అందులో చేయడానికి ప్రయత్నించినా వాటిని చివరిలో జోడించడం మంచిది.

బ్రెడ్ ఆహారాలు..

బ్రెడ్ ఆధారిత ఆహారాలు కుక్కర్లో ప్రయత్నిస్తుంటే అవి అంతగా కరకరలాడుతూ రాకపోవడం గమనించవచ్చు. కుక్కర్లో ఇవి తయారు చేసే సౌలభ్యం ఉన్నా ఓవెన్ లో వచ్చినట్టు రావు.

ఇది కూడా చదవండి: Healthy Rotis: రాగి, గోధుమ, జొన్న.. మూడింటిలో ఏది బెస్ట్? ఆరోగ్యానికి ఏ రొట్టెలు మంచివంటే..!


కేక్స్.. కుకీస్..

కేకులు, బిస్కెట్లు వంటి బేకింగ్ ఆహారాలు ఓపెన్ లేకపోయినా ప్రెషర్ కుక్కర్లో వండచ్చని చాలామంది చెప్పడం, వాటిని ట్రై చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కుక్కర్ లో వాటి ఆకారం నుండి రుచి వరకు అన్నీ మారిపోతాయి.

పండ్లు..

పండ్లు, పండ్ల ఆధారిత డెజర్ట్ లు లేదా రుచికరమైన వంటకాలను కుక్కర్లో వండటం మంచిది కాదు. పండ్లలో ఉన్న సున్నితమైన పోషకాల నుండి వాటి ఆకారం వరకు అన్నీ మారిపోతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 02 , 2024 | 11:45 AM

Advertising
Advertising